హోమ్ /వార్తలు /సినిమా /

NTR | Koratala Siva : ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌ మళ్లీ మారిందా..

NTR | Koratala Siva : ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌ మళ్లీ మారిందా..

జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్

NTR | Koratala Siva : ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

  ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీగా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కొరటాలతో చెయ్యబోయే ఎన్టీఆర్ 30 కి హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫైనల్ అయ్యింది అని మొన్నటి దాకా టాక్ వచ్చింది. అంతేకాదు దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని అన్నారు. మరోవైపు అటు కియారా అద్వానీ కూడా ఓ సౌత్ సినిమాలో నటించబోతున్నట్లుగా చెప్పేసరికి అందరూ ఎన్టీఆర్ 30 కె కియారా రాబోతుంది అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో హీరోయిన్‌గా కియారా కాదని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30లో కియారా స్థానంలో పూజ హేగ్డే వచ్చి చేరింది అని తాజా సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ 30 లో పూజ హెగ్డే దాదాపు ఖరారు అయినట్లేనట. ఇటు సౌత్‌తో పాటు అటు నార్త్‌లో కూడా పూజాకు భారీ క్రేజ్ ఉండడంతో దర్శక నిర్మాతలు పూజా వైపు చూస్తున్నారట. ఈ విషయంలో అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

  ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తుండడంతో.. విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు కొరటాల శివ.

  ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు. రాజమౌళి దర్శకుడు."రౌద్రం రణం రుధిరం" అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్‌లో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సంబంధించిన షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఆక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుంది.


  దీని తర్వాత ఆయన సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక మరోవైపు ఎన్టీఆర్ జెమిని టీవీలో ఓ గేమ్ షో చేస్తున్నాడు. గ‌తంలో ఇదే షోను నాగార్జున‌, చిరంజీవి 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Jr ntr, Kiara advani, Koratala siva, Pooja Hegde

  ఉత్తమ కథలు