ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)లో నటిస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan) మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రం అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది చిత్రబృందం. కాగా జనవరి 7న కూడా ఈ సినిమా విడుదల కాలేదు. దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో సినిమాను మరోసారి వాయిదా వేసింది టీమ్. దీంతో ఎన్టీఆర్ కొత్త సినిమాలో త్వరలో ప్రారంభించనున్నారని తెలుస్తోంది. గత మూడు సంవత్సరాలుగా ఎన్టీఆర్ నుంచి ఎటువంటీ సినిమాలేదు. దీంతో ఇక ఎటువంటీ ఆలస్యం లేకుండా ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టనున్నారట. అందులో భాగంగా టీమ్ హీరోయిన్‌ను వేతికే పనిలో ఉందట. మరి ఈ సినిమాకి మొదటి నుంచి కూడా హీరోయిన్ ఎవరు అనే దాని పట్ల ఆసక్తి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులు నుంచి ఫిల్మ్ సర్కిల్స్ సహా సోషల్ మీడియా వర్గాల్లో తారక్ సరసన హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటించనుందని.. ఆమె దాదాపు ఫిక్స్ అయ్యినట్టు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో...
ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తుండడంతో.. విలన్ గా ఓ బాలీవుడ్ స్టార్ ను కూడా తీసుకొస్తారని తెలుస్తోంది. దీనిపై కొంత క్లారిటీ రావాలసిఉంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ.. ఎప్రిల్ 29, 2022న ఈ చిత్రం విడుదల కానుందని ప్రకటించారు దర్శక నిర్మాతలు. అయితే ఈ డేట్ మారనుంది. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు కొరటాల శివ. దీని తర్వాత ఎన్టీఆర్ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సీతరామశాస్త్రీ రాసిన ఈ పాటను హేమచంద్ర తన గాత్రంతో అదరగొట్టారు.
Anchor Sreemukhi : పింక్ డ్రెస్‌లో మరింత అందంగా యాంకర్ శ్రీముఖి... అదిరిన లేటెస్ట్ పిక్స్..
ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Koratala siva, NTR, Tollywood news