NTR - Koratala Siva: కొరటాల శివ సినిమా కోసం ఆ సాహసం చేస్తోన్న ఎన్టీఆర్.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదల చేసిన దోస్తీ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అంతేకాదు అక్కడ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లీక్ కాకుండా.. ఎన్టీర్, రామ్ చరణ్,రాజమౌళి సహా అందరికీ స్పెషల్ ఐడీ కార్డులు కూడా ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. మరోవైపు కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసారు.రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఇక వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కే సినిమా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో పట్టాలెక్కనుంది.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ తర్వాత బరువు తగ్గడానికి రెడీ అవుతున్నారు. అప్పటి వరకు కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ లీడర్ కాకుండా వేరే సన్నివేశాలను తెరకెక్కిస్తాడట. సెకండ్ షెడ్యూల్‌లో మాత్రం ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేశారట కొరటాల శివ. అందుకు తగ్గట్టు ఎన్టీఆర్ తన ఫిజిక్ తగ్గించుకోనున్నట్టు సమాచారం.
‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి కలిసి పని చేస్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసారు కొరటాల శివ. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసారు కొరటాల శివ. ప్యాన్ ఇండియ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొరటాల శివ ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.
ఎన్టీఆర్‌తో కొరటాల శివ రెండోసారి తెరకెక్కించబోతున్నఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ తరహా స్టూడెంట్స్ రాజకీయాలతో వాళ్ల విలువైన జీవితం కోల్పోకూడదనే అమూల్యమైన సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సమకాలీన రాజకీయా అంశాలతో ఈ సినిమా కథను రెడీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక విద్యార్ధి నాయకుడు ఎలా రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ పొలిటికల్ లీడర్ పాత్ర ఉందట. ఎన్టీఆర్‌తో సరి సమానాంగా ఉండే ఈ పాత్ర కోసం విజయశాంతి పేరును అనుకున్నారు. ఫైనల్‌గా ఈ క్యారెక్టర్ కోసం రమ్యకృష్ణను తీసుకున్నట్టు సమాచారం. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణకు భారీగానే ముట్టజెప్పారట. గతంలో రమ్యకృష్ణ, ఎన్టీఆర్‌తో కలిసి ‘సింహాద్రి’తో పాటు ‘నా అల్లుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి ఈ సినిమాలో ఎన్టీఆర్, రమ్యకృష్ణ కలిసి నటించనున్నారు. నరసింహాలో నీలాంబరి తరహా పాత్రలో రమ్యకృష్ణ రోల్‌ను కొరటాల శివ డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ లేకపోతే రష్మిక మందన్ నటించే అవకాశాలున్నాయి. త్వరలో ఇందులో నటించే హీరోయిన్ ఎవరనేది తెలియజేస్తారు.
ఇవి కూడా చదవండి
SP Balasubrahmanyam : అమ్మకానికి దివంగత ఎస్పీ బాలు ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ చరణ్..
అల్లు అర్జున్ కూతురు నుంచి ఎన్టీఆర్ కుమారుడు వరకు వెండితెరపై స్టార్ కిడ్స్ సందడి..
Suma Kanakala - Rajeev : వివాదంలో సుమ, రాజీవ్ కనకాల దంపతులు..
నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Jr ntr, Koratala siva, RRR, Tollywood