అవును బాలకృష్ణ ఫిల్మ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్..ఇపుడా కోరిక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాతో తీరబోతుంది. వివరాల్లోకి వెళితే..బాలయ్య వాళ్ల నాన్న.స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మొదటి భాగం సంక్రాంతి విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. అదే టాక్ తగ్గట్టు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్నినమోదు చేయలేదు.
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో ఎలాంటి డౌన్ ఫాల్స్ లేకుండా సాఫీగా సాగిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. ఈ సినిమా మొత్తంగా రూ.25 కోట్ల వసూళు చేసి చారిత్రక పరాజయం పాలైంది. అందుకే ఇపుడు రాబోతున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యాన్ని ..ఆయన డౌన్స్ ఫాల్స్..తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికవడం వంటివి ఎంతో ఎమోషనల్ సీన్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. అందుకే ముందుగా రిలీజ్ చేస్తామన్న ఫిబ్రవరి 7 న కాకుండా ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 28న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
ఇక ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను ఈరోజు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసారు. ఇప్పటి వరకు బాలయ్య నటించిన ఏ సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో విడుదల కాలేదు. ఇపుడు ఫస్ట్ టైమ్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ రకంగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో బాలయ్య సినిమా విడుదల కాలేదన్న లోటును ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తీర్చింది.
ఇవి కూడా చదవండి
నేడే చూడండి..అమెజాన్‌లో ‘ఎఫ్2’ వచ్చేస్తోంది
మాస్ మహారాజ్ రవితేజకు మళ్లీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..
కేరళ అమ్మాయిలు కావాలంటున్న నాని
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Balakrishna, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood