ఇప్పటికే ఈ చర్చ మొదలైపోయింది. గతేడాది వచ్చిన ‘మహానటి’ సినిమా సాధించిన విజయం చూసిన తర్వాత ఇప్పుడు ‘కథానాయకుడు’ సినిమా కూడా సావిత్రి బయోపిక్‌తో పోల్చేస్తున్నారు అభిమానులు. నిజానికి ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా నాటి మేటి తారల జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు కాబట్టి కచ్చితంగా పోలికలు అయితే ఉంటాయి. అవి వద్దన్నా కూడా ఆపరు.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కథానాయకుడు అలా విడుదలైందో లేదో అప్పుడే ‘మహానటి’తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కచ్చితంగా ‘మహానటి’కి ఎక్కువ మార్కులు పడతాయి.
అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఎన్టీఆర్ సినిమా జీవితంలో పెద్దగా కష్టాలు అనుభవించింది లేదు.. మహారాజులా ఆయన ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాల పాటు ఏలారాయన. కానీ సావిత్రి జీవితంలో మాత్రం చాలా కష్టాలున్నాయి.. ఆమె నిజం జీవితం కూడా అంతా కష్టాల మయమే. తెరపై నవ్వులు పూయించే ఆమె తెరవెనక మాత్రం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది. ఆ ఎమోషనల్ కంటెంట్‌ను చాలా బాగా పట్టుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కానీ ఇక్కడ క్రిష్‌కు అంత ఎమోషనల్ కంటెంట్ లేదు. అంతా ఎన్టీఆర్ వైభోగాన్ని మాత్రమే చూపించాలి. ‘కథానాయకుడు’లో అదే చేసాడాయన. ఇదే సినిమా పరాజయంలో కీలక పాత్ర పోషించింది.
తనకు ఇచ్చిన బాధ్యతను నూటికి నూరుశాతం పూర్తి చేసాడు క్రిష్. నందమూరి అభిమానులు కూడా ‘కథానాయకుడు’తో పండగ చేసుకుంటున్నారు.. కానీ సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అందుకే డిజాస్టర్ గా మారింది. ఇక మహానటితో ఈ చిత్రాన్ని పోల్చడం మరీ తొందరపాటే అవుతుంది. సావిత్రి జీవితం పూర్తిగా ‘మహానటి’లో ఉంటుంది. ఇక ఇప్పుడు ‘మహానాయకుడు’ కూడా విడుదలైన తర్వాత ‘మహానటి’తో పోలిస్తే అర్థవంతంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అప్పటి వరకు ఈ ఎదురు చూపులు తప్పవు.
దిశాపటానీ హాట్ ఫోటోషూట్..
ఇవి కూడా చదవండి
‘ఎన్టీఆర్’ సాక్షిగా తాతయ్యను మరిచిన తారక్
ఫ్యాన్స్ వెయిటింగ్..మహేష్ బాబు క్లారిటీ ఇచ్చేది ఆరోజే..
‘యాత్ర’ కోసం నాల్గోసారి ఆ పని చేసిన మమ్ముట్టి
ఎన్నికల్లో పోటీ చేయనున్న ‘మృతుడు’, అది కూడా నరేంద్ర మోదీపై
రూ.2లక్షల జీతం వదులుకుని పంచాయతీ బరిలోకి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Keerthy Suresh, NTR, NTR Biopic, Telugu Cinema, Tollywood