Home /News /movies /

NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రాజెక్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ రోల్..

NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రాజెక్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ రోల్..

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ (File/Photo)

కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ (File/Photo)

NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రాజెక్ట్‌లో యంగ్ టైగర్ స్పెషల్ రోల్లో చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

    NTR - Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ప్రాజెక్ట్‌లో యంగ్ టైగర్ స్పెషల్ రోల్లో చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. హీరో ఎన్టీఆర్‌కు అన్నయ్య కళ్యాణ్‌రామ్‌తో మంచి అన్నకు మంచి  అనుబంధమే ఉంది. ఇక గతంలో కళ్యాణ్ రామ్ లాస్‌లో ఉన్నపుడు ఆయన బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ‘జై లవకుశ’ సినిమా చేసి అన్నయ్యను ఆర్థికంగా ఆదుకున్నారు. అంతేకాదు ’ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేసే ప్రతి ప్రాజెక్ట్‌లో కళ్యాణ్‌రామ్‌ను నిర్మాణ భాగస్వామిగా ఉండేలా సినిమాలు ఓకే చేస్తున్నారు తారక్. ఆర్ఆర్ఆర్ తర్వాత  కొరటాల శివ.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా ఎన్టీఆర్.. మైత్రీ మూవీస్‌తో పాటు కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

    ఇప్పటికే మహేష్ బాబు.. తన ప్రతి చిత్రాన్ని తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా చిరంజీవి చేసే ప్రతి చిత్రాన్ని కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా హీరోగా ఉంటూనే నిర్మాతగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు వీళ్లు. మొన్నటి వరకు మహేష్ బాబు తన సినిమా డేట్స్ అన్ని ముందుగానే అన్నయ్య రమేష్ బాబుకు, అక్కయ్య మంజులకు కేటాయించి వాళ్లను కూడా నిర్మాణంలో భాగస్వామి చేసేవారు. ఇపుడు ఎన్టీఆర్ కూడా తాను రంగంలోకి దిగకుండా.. అన్నయ్యను నిర్మాతగా రంగంలోకి దింపి నిర్మాణ భాగస్వామిగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఈ రకంగా నిర్మాతగా కళ్యాణ్ రామ్‌కు పెద్దగా టెన్షన్స్ ఉండవు.మొత్తం షూటింగ్ సహా అన్ని వ్యవహారాలన్ని ఆయా నిర్మాతలే చూసుకుంటారు. కేవలం టైటిల్ కార్డ్స్‌లో  మాత్రమే ఆయన పేరు ఉంటుంది.

    NTR - Kalyan Ram Tollywood Film Industry And Bollywood Kollywood Sandalwood Blood Brothers NTR Kalyan Ram Chiranjeevi Pawan Kalyan Balakrishna Harikrishna,NTR - Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా సినీ ఇండస్ట్రీలో అన్నదమ్ములైన హీరోలు,దర్శక, నిర్మాతలు..,NTR jr,Kalyan Ram,NTR Kalyan Ram,Tollywood Brothers,Tollywood Blood Brothers,Mahesh babu Ramesh babu,Krishna Brothers,Chiranjeevi Nagababu Pawan Kalyan Brothers,Harikrishna Balakrishna Brothers,jr ntr kalyan ram brothers,naga chaitanya akhil Brothers,vijay devarakonda anand devarakonda,tollywood,allu arjun allu sirish,tollywood,telugu cinema,Bollywood Brothers,Kollywood Brothers,Sandalwood Brother,హరికృష్ణ బాలకృష్ణ అన్నదమ్ములు,పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు,నాగ చైతన్య అఖిల్,వెంకటేష్ సురేష్ బాబు,రానా దగ్గుబాటి అభిరామ్,నాగ చైతన్య అఖిల్, అల్లు అర్జున్ అల్లు శిరీష్, విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ,రాజ్ కపూర్ సోదరులు,కమల్ హాసన్ సోదరులు, శాండిల్ వుడ్ సోదరులు,ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ టాలీవుడ్ అన్నదమ్ముల అనుబంధం,
    ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ (Twitter/Photo)


    ఐతే  ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తాను హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ్ దర్శకత్వంలో ‘బింబిసార’ అనే భారీ పీరియాడిక్ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించనున్నారు. అంటే ఈ సినిమాకు అత్యంత  కీలకమైన కథను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు సమాచారం.

    Bimbisara Nandamuri Kalyan Ram as Bimbisaram NKR 18
    ‘బింబిసార’గా నందమూరి కళ్యాణ్ రామ్ (Twitter/Photo)


    ఈ  రకంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ‘బింబిసార’లో తన వంతు పాత్ర పోషించనున్నట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్ రామ్ హీరోగా నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ సినిమాకు తన గాత్రాన్ని అందిస్తున్నారు.  ‘బింబిసార’ విషయానికొస్తే..   టైమ్ ట్రావెల్ నేపథ్యంలో చారిత్రక అంశాలతో ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థెరిసాతో పాటు సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bimbisara Movie, Jr ntr, Kalyan Ram Nandamuri, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు