NTR - Kalyan Ram: అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు ఆ విధంగా అండగా ఉంటున్న తమ్ముడు ఎన్టీఆర్..

ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ (File/Photo)

Jr NTR - Kalyan Ram Nandamuri | ఇప్పటి వరకు ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక నుంచి అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు ఆ విషయంలో అండగా ఉంటానంటున్నారు ఎన్టీఆర్.  వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    NTR - Kalyan Ram: ఇప్పటి వరకు ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక నుంచి అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు ఆ విషయంలో అండగా ఉంటానంటున్నారు తమ్ముడు ఎన్టీఆర్.  వివరాల్లోకి వెళితే..  ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌ ఎందుకో క్యాన్సిల్ అయింది. ఐతే.. ఎన్టీఆర్ మాత్రం.. కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్‌తో కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

    ఎన్టీఆర్ 30వ చిత్రానికి సమర్పకుడిగా కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ (Twitter/Photo)


    ఐతే ఆర్ఆర్ఆర్ తర్వాత  కొరటాల శిశ.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా ఎన్టీఆర్.. మైత్రీ మూవీస్‌తో పాటు కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కూడా సంయుక్తంగా తెరకెక్కించనున్నారు.

    ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. (Twitter/Photo)


    కొరటాల శివతో పాటు ప్రశాంత్‌ నీల్  ఈ చిత్రాలన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్నాయి. ఈ సందర్భంగా ఇక నుంచి తాను చేసే ప్రతి చిత్రాన్ని అన్న కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా ఉండాలనే కండిషన్స్ పెట్టాడట ఎన్టీఆర్. ఇక నుంచి ఎన్టీఆర్ చేసే ప్రతి చిత్రానికి కళ్యాణ్ రామ్ మరో నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ రకంగా కళ్యాణ్ రామ్‌ను నిర్మాతగా ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చాడట ఎన్టీఆర్.

    మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. వరుసకు తామిద్దరం బాబాయి- అబ్బాయిలం అయినప్పటికీ.. అన్నాదమ్ముల్లా ఉంటామని పవన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కాగా ఖుషీ వరకు పవన్, చెర్రీ దగ్గర అప్పు తీసుకునేవారట. అప్పటివరకు తీసుకున్న డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వలేదట. ఈ విషయాన్ని పవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఆ ఇంటర్వ్యూ ఇప్పటిది కాదు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిరుత చిత్రం ద్వారా రామ్ చరణ్‌ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చేసిన పలు ప్రమోషన్లలో చరణ్‌తో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్‌, నాగబాబు పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అందులో చిరు, పవన్ గురించి మాట్లాడుతూ.. పవన్ సాధారణంగా చెర్రీ దగ్గర డబ్బులు అప్పు చేస్తూ ఉంటాడు అని అన్నారు. దానికి పవన్ స్పందిస్తూ.. 'చెర్రీ దగ్గర అప్పు చేయడానికి నేనేం ఇబ్బందిగా ఫీల్ అవ్వను. నాకు డబ్బులు కావాలనుకుంటే ఎవ్వరి దగ్గరైనా అప్పు చేస్తా. చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్న ప్రతి సారి నెక్ట్స్‌ మూవీ చేసిన తరువాత నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తా అని చెబుతూ ఉంటాను. ఖుషీ వరకు చెర్రీ దగ్గర డబ్బులు తీసుకున్నా. కానీ తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు చరణ్ టాలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడు కాబట్టి, అతడికి కచ్చితంగా ఇచ్చి తీరాలి' అని అన్నారు.
    కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్


    ఇప్పటికే మహేష్ బాబు.. తన ప్రతి చిత్రాన్ని తాను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా చిరంజీవి చేసే ప్రతి చిత్రాన్ని కూడా తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రకంగా హీరోగా ఉంటూనే నిర్మాతగా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు వీళ్లు. మొన్నటి వరకు మహేష్ బాబు తన సినిమా డేట్స్ అన్ని ముందుగానే అన్నయ్య రమేష్ బాబుకు, అక్కయ్య మంజులకు కేటాయించి వాళ్లను కూడా నిర్మాణంలో భాగస్వామి చేసేవారు. ఇపుడు ఎన్టీఆర్ కూడా తాను రంగంలోకి దిగకుండా.. అన్నయ్యను నిర్మాతగా రంగంలోకి దింపి నిర్మాణ భాగస్వామిగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఈ రకంగా నిర్మాతగా కళ్యాణ్ రామ్‌కు పెద్దగా టెన్షన్స్ ఉండవు.

    తండ్రి హరికృష్ణ, కళ్యాణ్ రామ్‌తో ఎన్టీఆర్ (File/Photo)


    మొత్తం షూటింగ్ సహా అన్ని వ్యవహారాలన్ని ఆయా నిర్మాతలే చూసుకుంటారు. కేవలం టైటిల్ కార్డ్స్‌లో  మాత్రమే ఆయన పేరు ఉంటుంది.  మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్.. తాను చేసే సినిమాలతో అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు  ఈ  రకంగా సాయం చేయడం నిజంగానే గొప్ప విషయం. మరోవైపు ఎన్టీఆర్.. తన తండ్రి కొడుకు పేరు కలిసొచ్చేటట్టు ‘భార్గవ్ హరి’ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇందులో తన శ్రీమతి లక్ష్మీ ప్రణతిని భాగస్వామిగా చేయనున్నట్టు సమాచారం. ఈ రకంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్లను అండగా నిలుస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: