ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీపై కాపీ ఆరోపణలు.. తన సినిమానే కాపీ చేసారంటూ తమిళ హీరో రచ్చ..

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ చిత్రం నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. తాజాగా ఈ సినిమా కథపై తనదే అంటూ తమిళ మాజీ హీరో రచ్చ రచ్చ చేస్తున్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 2:43 PM IST
ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీపై కాపీ ఆరోపణలు.. తన సినిమానే కాపీ చేసారంటూ తమిళ హీరో రచ్చ..
ఎన్టీఆర్‌తో పూరీ జగన్నాథ్
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ చిత్రం నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేసారు.ఇప్పటికే ‘టెంపర్’ మూవీని హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’గా రీమేక్ చేస్తే సూపర్ హిట్టైయింది. అంతేకాదు తమిళ్‌లో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేసారు. ఈ శనివారం విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా టెంపర్ సినిమాపై కొత్త వివాదం మొదలైంది. విడుదలైన దాదాపు మూడేళ్ల తర్వాత  ఈ సినిమా కాపీ కథ అంటూ ‘అయోగ్య’ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర చేసిన పార్తీపన్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. 1993లో తన క్రైమ్ థ్రిల్లర్ ‘ఉల్లే వెలియే’ స్టోరీతోనే ‘టెంపర్’ సినిమాను తెరకెక్కించినట్టు చెబుతున్నాడు. పార్తీపన్ ఆరోపణలతో ‘అయోగ్య’ చిత్రంపై కొత్త వివాదం మొదలైంది.

NTR Jr temper movie copyright issue raise..here are the details,ntr jr,junior ntr temper copy right issue,ntr jr temper movie copyright issue,ayogya,vishal ayogya,vishal ayogya teaser,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,R. Parthiban,R. Parthiban raise temper copyritht issue,jr ntr rrr,temper vs ayogya,jr ntr,vishal ayogya,ayogya trailer vishal,vishal new movie trailer ayogya,ayogya trailer,vishal ayogya movie,jr ntr temper,ayogya official teaser,ntr,vishal ayogya trailer,ayogya movie teaser,ayogya trailer tamil,temper tamil remake ayogya,ntr temper,ayogya tamil movie trailer,ayogya vishal movie teaser,ayogya movie,vishal,ayogya movie songs,tollywood,kollywood,bollywood,temper simmba,ntr jr ranveer singh,ntr jr vishal ranveer singh,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,టెంపర్ కాపీ రైట్ ఇష్యూ పార్తిపన్,టెంపర్ విశాల్ అయోగ్య,జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ విశాల్ అయోగ్య,పార్తీబన్,పార్తీపన్ టెంపర్ కాపీ రైట్ ఇష్యూ,ఎన్టీఆర్ ట్విట్టర్,ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
విశాల్, ఎన్టీఆర్


ఐతే.. ఈ కాపీ వివాదంపై కోర్టుకెల్లే ఆలోచన కానీ..కేసులు పెట్టే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పడం కొసమెరుపు.మరి కాపీ రైట్ ఇష్యూపై దర్శకుడు పూరీ జగన్నాథ్, కథ అందించిన వక్కంతం వంశీ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇక వెంకట్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అయోగ్య’లో విశాల్ హీరోగా నటించాడు. రాశిఖన్నా కథానాయికగా నటించింది. ఈ సినిమాలో విశాల్ నటనకు విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నారు.First published: May 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు