NTR Jr: హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ మూవీకి తీసుకున్న తొలి పారితోషం ఎంతో తెలుసా..

ఎన్టీఆర్ తొలి పారితోషకం (Twitter/Photo)

NTR Jr First Remunaration | ఎన్టీఆర్ జూనియర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్‌గా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నారు ఎన్టీఆర్. ఇక హీరోగా తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ సినిమా కోసం ఎన్టీఆర్ అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా..

  • Share this:
    NTR Jr First Remunaration | ఎన్టీఆర్ జూనియర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోగా.. యంగ్ టైగర్‌గా దమ్ము చూపుతూ దుమ్ము లేపుతున్నారు ఎన్టీఆర్. అంతేకాదు ఇప్పటి తరం హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో ‘అదుర్స్’ అనిసిస్తున్నాడు. ఊసరవెల్లిలా డిఫరెంట్ కేరెక్టర్లలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నారు. తెలుగుప్రేక్షక బృందావనంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్ (‘రౌద్రం రణం రుధిరం’)
    అనే సినిమాలో కొమరం భీమ్‌గా పలకరించబోతున్నాడు. మొదటి నుంచి జూనియర్ స్టైలే వేరు. ‘బ్రహర్షి విశ్వామిత్ర’ లో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై మెరిసారు. హిందీ వెర్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత 1997లో  అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ . ఈ మూవీలో బాలరాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి.. మెప్పించాడు. ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు సైతం అందుకున్నారు తారక్.

    ఆ తర్వాత 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్నుచూడాలని’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ‘నువ్వు వస్తావని’ డైరెక్టర్ దివంగత వంకినేని రత్నప్రతాప్ డైరెక్ట్ చేసారు.  కానీ ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. నవంబర్ 2000లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినపుడు ఎన్టీఆర్ వయసు 17 ఏళ్లు.

    హీరోగా ఎన్టీఆర్ తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ (Twiter/Photo)


    ఇక ఎన్టీఆర్ 18వ ఏట ఆయన పుట్టినరోజు తర్వాత 5 రోజులకు మే 25న ఈ మూవీ విడుదలైంది. పూర్తి స్థాయి  హీరోగా మారిన ఎన్టీఆర్  ఈ సినిమా కోసం అందుకున్న పారితోషకం రూ. 4 లక్షలు. ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఎన్టీఆర్ ఆ డబ్బులను అమ్మ చేతిలో పెట్టాడు. అంతేకాదు ఆ డబ్బును ఎన్నో రోజుల పాటు లెక్క పెడుతూ కూర్చున్నాడట. ఈ 20 ఏళ్లలో ఎన్టీఆర్ పారితోషకం ఎన్నో రెట్టు పెరిగింది.

    ‘ఆర్ఆర్ఆర్’లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ (Twitter/Photo)


    ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం రూ. 30 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా.. మొత్తం కలుపుకుంటే.. రూ. 50 కోట్ల వరకు ఎన్టీఆర్‌కు దక్కనున్నట్టు సమాచారం. మొత్తంగా ఎన్టీఆర్ 20 ఏళ్ల నట జీవితంలో హీరోగా ఎంతగానో ఎదిగిపోయారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: