NTR: ఎన్టీఆర్ మరో సంచనలం.. కొత్త రియాలిటీ షో కోసం కళ్లు చెదిరే పారితోషకం..

ఎన్టీఆర్ (Twitter/Photo)

NTR Jr | ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మరో రియాలిటీ షో చేయనున్నాడు. ఈ షో కోసం తారక్... కళ్లు చెదిరే పారితోషకం తీసుకోనున్నట్టు సమాచారం.

  • Share this:
    NTR Jr | ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమా తర్వాత తారక్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘అయినను రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ  చిత్రంలో ఎన్టీఆర్ పొలిటిషన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులందరు లైన్‌లో ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ .. కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తెలుగులో బిగ్‌బాస్ షో ఫస్ట్ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి ఈ షోను ప్రేక్షకుల్లో తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌ను హోస్ట్ చేయలేకపోయాడు. తాజాగా ఎన్టీఆర్ మరో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం. ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ జెమినీ ఈ రియాలిటీ షోను ప్లాన్ చేశారు.

    మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్‌కు భారీగానే పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. ఈ రియాలిటీ షోను 60 ఎపిసోడ్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్టీఆర్‌కు రూ. 30 లక్షల చొప్పున మొత్తంగా రూ. 18 కోట్ల వరకు పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. తెలుగులో ఓ రియాలిటీ షో కోసం ఇంత భారీ మొత్తంలో పారితోషకం ఇవ్వడం ఇదే మొదటిసారి అంటున్నారు.

    RRR NTR Komaram Bheem RAMARAJU FOR BHEEM SPOOF Video Go Viral On Social Media,jr ntr,jr ntr bheem teaser,RAMARAJU FOR BHEEM SPOOF,RRR NTR Spoof Video,rrr movie twitter,rrr movie bheem teaser controversy,bheem teaser sc st fires on rajamouli,telugu cinema,రాజమౌళి,ట్రిపుల్ ఆర్ భీమ్ టీజర్‌పై ఫైర్,ఆదివాసీలు రాజమౌళికి వార్నింగ్,ఎన్టీఆర్ కొమరం భీమ్ స్పూఫ్ వీడియో,సోషల్ మీడియాలో వైరల్
    ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ (Twitter/Photo/RRR Team)


    ఇప్పటికే ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్స్‌ను రెడీ చేస్తున్నారట. ఫిబ్రవరి తర్వాత 20 రోజులు ఈ షో కోసం డేట్స్ కేటాయించాడట ఎన్టీఆర్. 20 రోజుల్లో 60 రోజుల ఎపిసోడ్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారట. మొత్తంగా ఇప్పటికే బిగ్‌బాస్‌ షోతో తనదైన యాంకరింగ్‌తో మెస్మరైజ్ చేసిన తారక్.. ఇపుడు ఈ రియాలిటీ షోతో ప్రేక్షకులను ఏ మేరకు తన మాయలో పడేస్తాడనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: