Home /News /movies /

NTR JR SPOKE TO ONE OF HIS FAN IN CRITICAL CONDITION AND HIS SPOKE TO HIS MOTHER THROUGH SPEAKER PHONE TA

NTR Jr : ప్రాణాపాయంలో ఉన్న అభిమాని తల్లిని ఫోన్‌లో పరామర్శించిన తారక్.. వీడియో వైరల్..

ఎన్టీఆర్ ( NTR Photo : Twitter)

ఎన్టీఆర్ ( NTR Photo : Twitter)

NTR Jr : ప్రాణాపాయంలో ఉన్న అభిమాని తల్లిని ఫోన్‌లో పరామర్శించిన ఎన్టీఆర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    NTR Jr : అభిమాని లేనిదే హీరోలు లేరులే.. అనుచరులు లేనిదే లీడర్లు లేరులే అన్నట్లు.. మన హీరోలకు అభిమానులంటే ఎనలేని ప్రేమ ఉంటోంది. తాజాగా ఎన్టీఆర్ కూడా ప్రాణాపాయంలో ఉన్నా ఓ అభిమాని తల్లిని ఫోన్ కాల్ ద్వారా పరామర్శించారు. వివరాల్లోకి వెళితే..  ఎన్టీఆర్ జూనియర్ (Nandamuri Taraka Ramarao) సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. తాజాగా తారక్ వీరాభిమాని అయిన జనార్ధన్ అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్..  తన అభిమాని అమ్మగారికి ఫోన్ చేసి మరి జనార్ధన్ ఆరోగ్యం విషయమై పరామర్శించారు. అంతేకాదు దేవుడి దయతో జనార్దన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అంతేకాదు ఆ కుటుంబానికీ అండగా ఉంటానని హామి ఇచ్చాడు. సదరు అభిమాని తల్లితో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇపుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. దాదాపు  మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు వీరుడు  కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఎలివేషన్ బాగానే ఉన్నా.. ఈయన పాత్రను రామ్ చరణ్ పాత్రతో పోలీస్తే.. తక్కువ చేసినట్టు తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా.


    ఆ సంగతి పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో  ఎన్టీఆర్.. ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఊపులో ఇపుడు కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. కొరటాల శివ విషయానికొస్తే.. రీసెంట్‌గా  ఈయన చిరంజీవి, రామ్ చరణ్ వంటి మెగా తండ్రీ తనయులతో తెరకెక్కించిన ఆచార్య సినిమాతో దర్శకుడిగా విమర్శల పాలైయ్యాడు.ఈ సినిమాను కొరటాల శివనే డైరెక్ట్ చేసారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

    Chiranjeevi - Mohan Babu - Ravi Teja - Vijay Devarakonda : అప్పటి తరంలో చిరంజీవి, మోహన్ బాబు.. ఈ జనరేషన్‌లో రవితేజ, విజయ్ దేవరకొండ..

    అయినా.. ఎన్టీఆర్ కూడా ఎలాంటి సంకోచం లేకుండా.. తన నెక్ట్స్ మూవీని కొరటాల శివతో చేస్తున్నాడు. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్‌ ఇచ్చి దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవ్వాలని చూస్తున్నారు. ఒక రకంగా కొరటాల శివకు ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఓ ఆయుధంలా దొరికాడు. మరి ఈ ఆయుధాన్ని కొరటాల శివ ఎలా ఉపయోగించి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది చూడాలి. ఈ సినిమా సెప్టెంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.



    మరోవైపు ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో చేస్తోన్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో నవంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విజయ దశమి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకుడికి కండిషన్స్ పెట్టాడట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు