NTR: ఎన్టీఆర్ ఫిల్మ్ కెరీర్‌లో ఇప్పటికీ విడుదల కానీ ఆ సినిమా ఏమిటో తెలుసా..

ఎన్టీఆర్ (Twitter/Photo)

Jr NTR | టాలీవుడ్‌లో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన తారక్. ఆయన కెరీర్‌లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.

  • Share this:
    NTR Jr | టాలీవుడ్‌లో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్... ఆయన కెరీర్‌లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. వివరాల్లోకి వెళితే.. తారక్ చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాలో రాముడిగా తన ఫిల్మ్ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలిని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. తారక్ విషయానికొస్తే నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా యాక్షన్ సీన్స్‌లో తొడకట్టగలనని ప్రూవ్ చేసుకున్నారు.

    ఐతే.. జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి మొఖానికి రంగేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో. ఈ సినిమాలో తారక్.. భరతుడి క్యారెక్టర్ చేసారు.

    తాత ఎన్టీఆర్ హీరోగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌‌తో ముఖానికి మేకప్ వేసుకున్న తారక్.. హిందీ విశ్వామిత్ర విడుదల కాలేకపోయింది. (Facebook/Photo)


    తెలుగు వెర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్రా సినిమాలో  బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుశ్శంతుడుగా వేసారు. హిందీలో కూడా అదే వేషం వేసారు బాలయ్య. ఈ చిత్రంలో దుశ్శంతుడు కొడుకైన భరతుడిగా చిన్నఎన్టీఆర్ యాక్ట్ చేసారు.మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైనా హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని అన్నగారు విడుదల చేయకుండా హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం వంటి కొన్ని కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది.ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.  ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం. ఈ రకంగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: