NTR JR RRR FAME FILM CAREER THESE ARE THE FILM NOT YET RELEASED TILL NOW HERE ARE THE DETAILS TA
NTR Jr: ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటికీ విడుదల కానీ ఆ సినిమా ఏంటో తెలుసా..
ఎన్టీఆర్ (File/Photo)
NTR Jr | టాలీవుడ్లో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల కెరీర్లో 30 సినిమాలకు చేరువైన తారక్. ఆయన కెరీర్లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.
NTR Jr: టాలీవుడ్లో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇన్నేళ్ల సినీ కెరీర్లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్... ఆయన కెరీర్లో యాక్ట్ చేసిన ఓ సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. వివరాల్లోకి వెళితే.. తారక్ చిన్నపుడు గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాలో రాముడిగా తన ఫిల్మ్ కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలిని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యాడు. తారక్ విషయానికొస్తే నచ్చిన పాత్ర వస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి.. ఆ రోల్ అంతం చూడటంలో తాతలాగే మొండిఘటం. అంతే కాదు బాబాయ్ బాలకృష్ణలా యాక్షన్ సీన్స్‌లో తొడకట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు.
ఐతే.. జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి ముఖానికి రంగేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’. ఈ సినిమాలో తారక్.. భరతుడి క్యారెక్టర్ చేసాడు.
తాత ఎన్టీఆర్ హీరోగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌తో ముఖానికి మేకప్ వేసుకున్న తారక్.. హిందీ విశ్వామిత్ర విడుదల కాలేకపోయింది. (Facebook/Photo)
తెలుగు వెర్షన్ బ్రహ్మర్షి విశ్వామిత్రా సినిమాలో బాలకృష్ణ.. హరిశ్చంద్రుడు, దుశ్శంతుడు పాత్రల్లో నటించారు. హిందీలో కూడా బాలయ్య అదే వేషం వేసారు. ఈ చిత్రంలో దుశ్శంతుడు కొడుకైన భరతుడిగా జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసాడు. ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా సమయంలో జూ. ఎన్టీఆర్ హిందీని అనర్గళంగా మాట్లాడం చూసి పెద్ద ఎన్టీఆర్ హిందీ వెర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో తారక్‌ను తీసుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ కావడంతో హిందీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని అన్నగారు విడుదల చేయకుండా హోల్ట్‌లో పెట్టారు. ఆ తర్వాత పెద్ద ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ కావడం.. ఆ తర్వాాత ఏర్పడిన రాజకీయ సంక్షోభాల కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం విశేషం. ఈ రకంగా నందమూరి కుటుంబంలో ముగ్గురు హీరోలు నటించిన ఈ సినిమా విడుదల కాకపోవడం యాదృచ్ఛికమనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.