హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna-NTR-Mahesh: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ భారీ విరాళాలు..

Nagarjuna-NTR-Mahesh: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ భారీ విరాళాలు..

ఎన్టీఆర్,నాగార్జున, మహేష్ బాబు విరాళం (Twitter/Photo)

ఎన్టీఆర్,నాగార్జున, మహేష్ బాబు విరాళం (Twitter/Photo)

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ వంతు విరాళం ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుంది. ఈ క్రమంలో పలువురు సినీ హీరోలు తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ .. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 1.50 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరదల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తమ వంతు విరాళం ప్రకటించారు.

  నాగార్జున.. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు.మరోవైపు చిరంజీవి కూడా 1 కోటి రూపాయాలను విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించాడు.

  ఇంకోవైపు విజయ్ దేవరకొండ రూ. 10లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్.. రూ. 5లక్షల విరాళం ప్రకటిస్తే.. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Anil Ravipudi, Chiranjeevi, CM KCR, Harish Shankar, Hyderabad Floods, Jr ntr, Mahesh babu, Nagarjuna Akkineni, Telangana, Tollywood, Trivikram, Vijay Devarakonda

  ఉత్తమ కథలు