హోమ్ /వార్తలు /సినిమా /

NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మహేష్ బాబు (Twitter/Photo)

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు మహేష్ బాబు (Twitter/Photo)

NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వెలుబడింది. ఈ షో కోసం ఇరు హీరోలు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన వెలుబడింది. యంగ్ టైగర్ఎన్టీఆర్ (Jr NTR) ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే జెమినీ టీవీలో వచ్చే “మీలో ఎవరో కోటీశ్వరులు”   (Evaru Meelo Koteeswarulu) షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఆయన తనదైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఈ షోకు గతంలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఫీలను తెచ్చిపెడుతున్నారు. ఇక అది అలా ఉంటే.. ఎన్టీఆర్ షోకి మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు.. టీఆర్పీ రికార్డ్స్‌ బద్దలుకొట్టాడనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  వస్తున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైయింది.

  ప్రేక్షకులకు మరింత వినోదం అందించే ఉద్ధేశ్యంలో భాగంగా షో నిర్వాహకులు మధ్య మధ్యలో పలువురు సినీ ప్రముఖులను షోలోకి గెస్టులుగా తీసుకొస్తున్నారు. ఈ షో ప్రారంభించిన మొదటి రోజే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథిగా తీసుకువచ్చారు. అంతేకాదు ఆయన షోలో ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ. 25 లక్షలు గెలుచుకుని అదరగొట్టారు. ఆ తర్వాత  తెలుగు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ గెస్ట్‌లుగా వచ్చి అలరించారు. ఆ తర్వాత సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, తమన్ ముఖ్య అతిథులుగా హాజరై అలరించారు. మధ్యలో సమంత కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. వీళ్లు అందరూ  రూ.  25 లక్షల చొప్పున గెలుచుకున్నారు.

  ఐతే.. వీళ్లందరికీ ప్రశ్నలు ముందుగానే లీకైయ్యాయా అనే అనుమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఎవరు అంత ఈజీగా రూ. 25 లక్షలు గెలుచుకోలేక కిందామీదైతున్నారు. కానీ ఈ షోకు వచ్చే  సెలబ్రిటీలు అందరు రూ. 25 లక్షలు ఈజీగా గెలుచుకుంటున్నారు. అంతకన్నా.. జెమిని టీవీవాళ్లు ఇవ్వడం లేదనే టాక్ కూడా ఉంది. ఇక మహేష్ బాబు పాల్గొనే ఈ షో రూ. 25 లక్షల రూపాయల గెలుచుకొని ఓ ఛారిటీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ షోలో ఎన్టీఆర్.. మహేష్ బాబును పలు ప్రశ్నలతో పాటు పర్సనల్ విషయాలను పంచుకోనున్నారు. ఈ ఎపిసోడ్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో లాస్ట్ ఎపిసోడ్‌గా ప్రసారం కానున్నట్టు సమాచారం. మహేష్ బాబు ఎపిసోడ్‌తో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ సీజన్‌కు ఎండ్ కార్డ్ వేయనున్నారు.

  Silver Screen Police: సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 1

  ఇప్పటి వరకు ఈ షో కోసం గెడ్డం పెంచిన ఎన్టీఆర్.. తాజాగా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలను నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ఖండించడంతో పాటు వారికి ఘాటైన వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ కూడా మామయ్య చంద్రబాబుకు సంఘీభావంగా ట్విట్టర్ వేదికగా ఈ సంఘటనను ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై జరిగాలి. వ్యక్తిగత విమర్శకులకు తావివ్వకూడదు. ముఖ్యంగా మన ఆడపుడచుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

  Silver Screen Police : సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 2

  ఇకపై ఇలాంటి వ్యాఖ్యలకు రాజకీయ  నాయకులు పులిస్టాప్ పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా గెడ్డం తీసెసి కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ మేకోవర్ అయిన లీక్ ఈ సందర్భంగా లీకైంది. మొత్తంగా ఈ నెలలోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షోకు మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ను శుభం కార్డు వేయనున్నట్టు సమాచారం.

  Silver Screen Police: పవన్, మహేష్, ఎన్టీఆర్ సహా ఈ తరంలో సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 3

  మొత్తంగా మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి మాస్ హీరోలు ఒకే వేదికపై ఎపుడెపుడు చూస్తామా అని ఇరు హీరోల అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ షో సోమవారం నుంచి గురు వారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jr ntr, Mahesh Babu, NTR Evaru Meelo Koteeswarulu, Tollywood

  ఉత్తమ కథలు