NTR JR KORATALA SIVA MOVIE SENIOR HERO RAJASEKHAR WILL PLAY CRUCIAL ROLE IN TARAK MOVIE TA
NTR Jr - Koratala Siva : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో సీనియర్ టాప్ స్టార్..
ఎన్టీఆర్, కొరటాల శివ (File/Photo)
NTR Jr - Koratala Siva : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాను ఈ నెల చివర్లో కొబ్బరికాయ కొట్టనున్నారు. అంతేకాదు అప్పటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయి పాత్రలో సీనియర్ టాప్ స్టార్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
NTR Jr - Koratala Siva: ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసారు. జనవరి 7న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనున్నారు. కానీ ఓమైక్రాన్ రూపంలో కరోనా విరుచుకుపడటంతో పాటు.. పలు రాష్రాల్లో సగం ఆక్యుపెన్షీతో థియేటర్స్ రన్ చేస్తుండంతో ఈ సినిమాను అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమాలో ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు కొరటాల శివ..చిరంజీవి, రామ్ చరణ్‌లతో తెరకెక్కించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి 4న విడుదల ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. ఈ మూవీ కూడా సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాను ఈ నెల చివర్లో కొబ్బరికాయ కొట్టనున్నారు. అంతేకాదు అప్పటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసారు. ఒకసారి రంగంలోకి దిగాకా .. మూడు షెడ్యూల్స్లలో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో మరో పవర్‌పుల్ పాత్ర ఎన్టీఆర్ బాబాయి పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసం రాజశేఖర్‌ను సంప్రదిస్తే.. ఆయన ఈ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక రాజశేఖర్ కూడా ఇపుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా.
ఎన్టీఆర్ బాబాయి పాత్రలో రాజశేఖర్ (File/Photo)
ఎన్టీఆర్,కొరటాల శివ సినిమాలో కథానాయికగా రామ్ చరణ్ భామ ఆలియా భట్‌ను ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గినట్టు సమాచారం. ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ముందుగా కియారా అద్వానీ, రష్మిక మందన్న, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఈ చిత్రంలో ఆలియా భట్ దాదాపు ఖరారైనట్టు సమాచారం. మరోవైపు సమంత కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నట్టు సమాచారం.
త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సినిమా కోసం ఆలియాకు భారీగానే పారితోషకం ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అందులో రామ్ చరణ్ సరసన నటించింది.ఇపుడు కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించబోతుంది.
ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ (file/Photo)
ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు రూ. 4.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.అనిరుథ్ రవిచంద్రన్ తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే కదా.‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి కలిసి పని చేస్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసారు కొరటాల శివ.
ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసారు కొరటాల శివ. ప్యాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొరటాల శివ ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.
ఎన్టీఆర్‌తో కొరటాల శివ రెండోసారి తెరకెక్కించబోతున్నఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ తరహా స్టూడెంట్స్ రాజకీయాలతో వాళ్ల విలువైన జీవితం కోల్పోకూడదనే అమూల్యమైన సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సమకాలీన రాజకీయా అంశాలతో ఈ సినిమా కథను రెడీ చేసినట్టు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ (Jr NTR Koratala Siva)
ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక విద్యార్ధి నాయకుడు ఎలా రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.