NTR Jr - Koratala Siva: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా అఫీషియల్ ప్రకటన చేసి చాలా రోజులే అవుతుంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది ఎపుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యారు. దీంతో పాటు ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో చేస్తున్నారు. మరోవైపు కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసారు. ఒకసారి రంగంలోకి దిగాకా .. మూడు షెడ్యూల్స్‌లలో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ సినిమాను దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 6 నుంచి 7 కేజీల వరకు బరువు తగ్గే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో తారక్.. స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలున్నాయి. అందుకోసం కాస్త సన్నబడాలని కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను కోరినట్టు సమాచారం.
అప్పటి వరకు కొరటాల శివ.. ఎన్టీఆర్‌తో స్టూడెంట్ లీడర్ కాకుండా వేరే సన్నివేశాలను తెరకెక్కిస్తాడట. సెకండ్ షెడ్యూల్‌లో మాత్రం ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించే సన్నివేశాలను షూట్ చేయాలని ప్లాన్ చేశారట కొరటాల శివ. అందుకు తగ్గట్టు ఎన్టీఆర్ తన ఫిజిక్ తగ్గించుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమా కోసం దాదాపు రూ. 4.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.
అనిరుథ్ రవిచంద్రన్ తెలుగులో ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే కదా.‘జనతా గ్యారేజ్’ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీళ్లిద్దరు.. ఇప్పుడు మరోసారి కలిసి పని చేస్తున్నారు. అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసారు కొరటాల శివ.
ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా అని కన్ఫామ్ చేసారు కొరటాల శివ. ప్యాన్ ఇండియ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొరటాల శివ ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.
Venkatesh : ఆర్తి అగర్వాల్ సహా వెంకటేష్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన భామలు వీళ్లే..
ఎన్టీఆర్‌తో కొరటాల శివ రెండోసారి తెరకెక్కించబోతున్నఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ తరహా స్టూడెంట్స్ రాజకీయాలతో వాళ్ల విలువైన జీవితం కోల్పోకూడదనే అమూల్యమైన సందేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. సమకాలీన రాజకీయా అంశాలతో ఈ సినిమా కథను రెడీ చేసినట్టు సమాచారం.
ఇప్పటికే మహేష్ బాబుతో ‘భరత్ అను నేను’ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీఎం కుమారుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తే.. ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను మాత్రం ఒక విద్యార్ధి నాయకుడు ఎలా రాజకీయాల్లో వచ్చి అంచలంచెలుగా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ లేదా రష్మిక మందన్న పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Koratala siva, RRR, Tollywood