NTR Jr: భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజున మరుపురాని కానుక ఇచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు మార్చి 18న ఘనంగా జరిగింది. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా భార్య లక్ష్మి ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ మరుపురాని పుట్టినరోజు కానుకగా ఇచ్చాడట. సిటీలో ఓ పెద్ద ఫామ్ హౌస్‌ను భార్య పేరున కొన్నాడట. అంతేకాదు ఆమె పుట్టినరోజు వేడుకలు అదే ఫామ్‌హౌస్‌లో అట్టహాసంగా జరిగినట్టు సమాచారం. తన బర్త్ డే సందర్భంగా భర్త ఇచ్చిన కానుక చూసి లక్ష్మి ప్రణతి తెగ సంబరపడిపోతుందట. ఇక జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహాం 2011లో జరిగింది. లక్ష్మి ప్రణతి విషయానికొస్తే.. ఆమె చంద్రబాబు చెల్లెలు మనవరాలు. వీరికి 2014లో అభయ్ రామ్, 2018లో భార్గవ్ రామ్‌కు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాను చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాకు ఓకే చెప్పాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.