NTR Jr - Evaru Meelo Koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పనున్నారా.. ?

fఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు (NTR Evaru Meelo Koteeswarulu)

NTR Jr - Evaru Meelo Koteeswarulu :ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే అంటున్నాయి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు.

 • Share this:
  NTR Jr - Evaru Meelo Koteeswarulu :ఎన్టీఆర్ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పనున్నారా అంటే ఔననే అంటున్నాయి ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు. గత కొన్ని వారాలుగా జెమిని ఎంటర్టైన్మెంట్ చానె‌ల్‌లో ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల వరకు ప్రసారం అవుతున్నాయి. మొదటి, రెండు వారాలు ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత రాను రాను ఈ షో రేటింగ్ తగ్గుతూ వస్తోంది. ఈ షో కోసం కంటెస్టెంట్‌తో ఎంత కష్టపడుతున్న రేటింగ్స్‌ మాత్రం ఆ రేంజ్‌లో మాత్రం రావడం లేదు. ఎన్టీఆర్  ఈ షోతో ఎంతో మంది సామాన్యుల కలను ఎన్టీఆర్ నెరవేర్చుతున్నారు. అంతేకాదు తనదైన అద్భుతమైన మాటతీరుతో కంటెస్టెంట్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఈ షో ప్రీమియర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ (Ram Charan) గెస్ట్‌గా వచ్చారు.

  ఈ షోలో దాదాపు రూ. 25 లక్షల వరకు గెలుచుకున్నారు. దీన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా అందజేసారు. ఈ ఎపిసోడ్‌కు  11.40 టీఆర్పీ రేటింగ్ సాధించి ఔరా అనిపించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ షోకు రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు కలిసి వచ్చి సందడి చేశారు. వీరు కూడా రూ. 25 లక్షల వరకు అమౌంట్ గెలుచుకున్నారు. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో సమంత సందడి చేసారు. ఈ ఛారిటబుల్ కోసం ఈమె కూడా ఈ షోలో రూ. 25 లక్షల  ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ షోలో ఎన్టీఆర్ కంటెస్టెంట్స్‌కు అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి.

  Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

  రెండు మూడు వారాలకు రేటింగ్స్ బాగానే ఉన్నా.. రాను రాను ఈ షోకు రేటింగ్స్ పడిపోతున్నాయి. బిగ్‌బాస్ షోతో రేటింగ్స్‌తో అదరగొట్టిన తారక్.. ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌తో  ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నట్టు సమాచారం. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తైయిందని దీపావళి రోజున మహేష్ బాబు హాజరు కానున్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రసారమైన ఈ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం పెద్ద తప్పు అని చెబుతున్నారు. ఇక ముందు ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించలేకపోవచ్చనే టాక్ వినబడుతోంది. మొత్తంగా వచ్చే నెల రెండు వారాల తర్వాత ఈ షోకు ఎన్టీఆర్ ప్యాకప్ చెప్పేయడం పక్కా చెబుతున్నారు.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌‌లతో పాటు  ఆలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియ, సముద్ర ఖని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  మరోవైపు ఎన్టీఆర్ వచ్చే నెలలో కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్ కాకుండా.. దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: