NTR - Evaru Meelo Koteeswaralu: మరోసారి అదరగొట్టిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులుకు అంతకంతకు పెరుగుతున్న టీఆర్పీ..

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా మరోసారి అదరగొట్టిన ఎన్టీఆర్ (Twitter/Photo)

NTR - Evaru Meelo Koteeswaralu: ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ చేస్తోన్న రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. తాజాగా ఈ ప్రోగ్రామ్ మూడో వారం కూడా అద్భుతమైన టీఆర్పీ సాధించి ఔరా అనిపించింది.

  • Share this:
    NTR - Evaru Meelo Koteeswaralu : ప్రెజెంట్ ఎన్టీఆర్ (Jr NTR)సినిమాలతో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా ఈ షోతో ఎంతో మంది సామాన్యుల కలను ఎన్టీఆర్ నెరవేర్చే పనిలో ఉన్నారు.  అంతేకాదు తనదైన అద్భుతమైన మాటతీరుతో కంటెస్టెంట్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. ఐతే.. తెలుగులో నాగార్జున(Nagarjuna), చిరంజీవి (Chiranjeevi) వంటి సీనియర్ హీరోలు హోస్ట్ చేసిన సక్సెస్ కానీ  ఈ ప్రోగ్రామ్‌ను ఎన్టీఆర్ ఇపుడు సూపర్ హిట్ చేసి చూపించారు. ఈ షో ప్రీమియర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ (Ram Charan) గెస్ట్‌గా వచ్చారు. ఈ షోలో దాదాపు రూ. 25 లక్షల వరకు గెలుచుకున్నారు. దీన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా అందజేసారు. ఈ ఎపిసోడ్‌కు  11.40 టీఆర్పీ రేటింగ్ సాధించి ఔరా అనిపించింది.

    గతంలో ఎవరు హోస్ట్ చేసిన ఇంత రేటింగ్ రాలేదు.  ఆ తర్వాత ప్రసారమైన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’  మొదటి వారం.. 5.62 రేటింగ్ సాధించింది. రెండో వారం ఈ ప్రోగ్రామ్.. 6.48 రేటింగ్ సాధించి గ్రోత్ చూపించింది.తాజాగా మూడో వారం ఈ ప్రోగ్రామ్ 7.30 రేటింగ్ సాధించి స్మాల్ స్క్రీన్ పై మరోసారి ఎన్టీఆర్ తన హోస్ట్‌కు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నారు.



    ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్..  సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్.. హాట్ సీట్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు  ప్రశ్నలు అడగటంతో పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.

    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    అంతేకాదు మధ్యలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ కంటెస్టెంట్స్‌తో కలిసి పోతున్నారు.  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమాలే కాదు.బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుంది. 

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    మొత్తంగా టీవీల్లో ప్రసారమయ్యే ఇతర ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే.. ఇది తక్కువే అని చెప్పాలి. కానీ గతంలో ఈ ప్రోగ్రామ్ ప్రసారమైనపుడు వచ్చిన రేటింగ్స్‌కు .. ప్రస్తుతం వస్తోన్న రేటింగ్స్ చూస్తే.. ఇది ఎక్కువ అనే చెప్పాలి. ఏమైనా గతంతో పోలిస్తే.. ఎన్టీఆర్ మోస్ట్‌గా ఈ ప్రోగ్రామ్‌ను విజయ తీరాలకు చేరుస్తున్నాడనే చెప్పాలి.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేసారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాను అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటించడం దాదాపు ఖాయమైంది. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: