Home /News /movies /

NTR JR DIE HARD FAN JANARDAN PASSES AWAY DUE TO RAOD ACCIDENT TA

NTR : ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతి.. శోక సంద్రంలో తారక్ ఫ్యాన్స్..

ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ అభిమాని మృతి (File/Photo)

ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ అభిమాని మృతి (File/Photo)

NTR : రీసెంట్‌గా ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ అభిమాని తల్లికి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఓదార్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్న సదురు అభిమాని మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

ఇంకా చదవండి ...
    NTR Jr : ఎన్టీఆర్‌క సహా చాలా మంది హీరోలకు తమను అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ అంటే  వల్లమాలిన అభిమానం. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ తాజాగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్ధన్‌కు హీరో ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అంతేకాదు తారక్ పై ప్రేమతో తన చేతిపై ఎన్టీఆర్ అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. రీసెంట్‌గా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతన్ని సమీపంలోని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి జనార్ధన్ కోమాలో ఉన్నాడు. ఇక ఆయన దగ్గర ఎన్టీఆర్ పేరు వినపడగానే చేతివేళ్లను కదిలించేవాడని డాక్టర్లు చెప్పారు. ఇక అభిమాని పరిస్థితి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమాని అమ్మగారికి ఫోన్ చేసి మరి జనార్ధన్ ఆరోగ్యం విషయమై పరామర్శించారు. అంతేకాదు దేవుడి దయతో జనార్దన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

    ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు జనార్ధన్ కోలుకోవాలని ప్రార్ధించినా.. తుదకు ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు.. శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రమాదంలో ఉన్న సమయంలో  ఎన్టీఆర్ జూనియర్ వారి కుటుంబాన్ని పరామర్శించి  (Nandamuri Taraka Ramarao) సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.



    ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. దాదాపు  మూడేళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు వీరుడు  కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఎలివేషన్ బాగానే ఉన్నా.. ఈయన పాత్రను రామ్ చరణ్ పాత్రతో పోలీస్తే.. తక్కువ చేసినట్టు తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ సంగతి పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో  ఎన్టీఆర్.. ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే ఊపులో ఇపుడు కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు