NTR JR BEFORE BIGG BOSS TELUGU SEASON ONE HOST JR NTR ALEREDY DONE ANOTHER TELUGU SERIAL HERE ARE THE DETAILS TA
HBD NTR: బిగ్‌బాస్ షో కంటే ముందు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఈ టీవీ సీరియల్ తెలుసా..
జూ ఎన్టీఆర్ బిగ్‌బాస్ (File/Photo)
Jr NTR Bigg Boss Serial | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక తారక్ బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో కంటే ముందు మరో తెలుగు సీరియల్లో నటించారు.
HBD NTR: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్లో సినిమాలే కాదు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో సీజన్‌తో పాటు నాల్గో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేసారు.
ఆ సంగతి పక్కన పెడితే.. ఇన్నేళ్ల కెరీర్లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్... త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రతో ప్రేక్షకులను పలకరించనున్నరు. ఇక బిగ్‌బాస్ షో కాకుండా తారక్ స్మాల్ స్క్రీన్ పై ఓ సీరియల్ కూడా చేసారు. ఈ సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ భక్త మార్కండేయ సీరియల్లోని వేషం (jr ntr rare photos/Twitter/Facebook)
చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అలరించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ చదువులో పడిపోయారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన ‘నిన్ను చూడాలని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు. ఆ సినిమా కంటే ముందే.. ఎన్టీఆర్ ఓ టెలి సిరీయల్లో నటించారు. ఈ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. ఈ సీరియల్లో ఎన్టీఆర్ టైటిల్ రోల్ భక్త మార్కండేయుని పాత్రలో నటించారు. ఈ సీరియల్ అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా తన సత్తా ఏంటో చూపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో నాల్గోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు కొరటాల శివ, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు అట్లీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వరుస సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘కొమరం భీమ్’ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉండనే ఉన్నాయి. మరోవైపు బిగ్‌బాస్ షో తర్వాత ఎన్టీఆర్... తెలుగులో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో చేయనున్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ రియాలిటీ షో మొదలై ఉండేది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.