ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ లాస్ట్ ఇయర్ దసరాకు విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటి వరకు తెలుగు తెరపై ఫ్యాక్షనిజాన్ని ఒక రకంగా చూపిస్తే..త్రివిక్రమ్ మాత్రం ఫ్యాక్షనిజంలోని నిజాలను ఈ సినిమాలో కొత్తగా చూపించాడు. ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. వెండితెరపై సూపర్ సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
రిలీజ్ చేయడం అంటే మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయడం కాదు. ఏమి లేదు ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలవుతున్న ప్రతి సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘అరవింత సమేత వీరరాఘవ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తైయిందట. అంతేకాదు త్వరలో జీ సినిమాస్‌లో ‘అరవింద సమేత వీరరాఘవ’ హిందీ వెర్షన్‌ను ప్రదర్శించేందకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ సినిమాలకు హిందీలో గిరాకీ ఉంది. మరి అరవింద సమేత వీర రాఘవ హిందీలో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
అఖిల్‌తో రోమాన్స్ చేయనున్న విజయ్ దేవరకొండ హీరోయిన్
బయోపిక్ కోసం క్రిష్‌కు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట..
రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..