టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో జూనియర్ ఎన్టీఆర్.. వాటే కాంబినేషన్..

విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్లున్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన వీళ్లిద్దరు కలిసి ఒక అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌ కోసం పని చేయనున్నారు.  వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 20, 2019, 6:24 PM IST
టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో జూనియర్ ఎన్టీఆర్.. వాటే కాంబినేషన్..
విరాట్ కోహ్లీ,జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
విరాట్ కోహ్లీ, ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి ఒకే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వాళ్లున్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన వీళ్లిద్దరు కలిసి ఒక అవేర్‌నేస్ ప్రోగ్రామ్‌ కోసం పని చేయనున్నారు.  వివరాల్లోకి వెళితే.. టీమ్ ఇండియా క్రికెట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. తాత సీనియర్ అడుగు జాడల్లో సినీమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా వీళ్లిద్దరు మద్యం తాగి వెహికల్స్ నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. ఒక్క తప్పిదం వల్ల వాహనం నడపిన వారితో పాటు ప్రమాదానికి గురైన కుటుంబాలు తీవ్ర వేధనను అనుభవిస్తున్నాయి. అందుకే దీనిపై ఒక అవగాహన పెంచేందకు ఎన్.డి.టీ.వీ ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అందులో భాగంగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, జూనియర్ ఎన్టీఆర్ చేతులు కలపనున్నారు. వీరితో పాటు దేశంలో వివిధ రంగాలకు చెందిన 7 గురు సెలబ్రిటీలు ఈ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయనున్నారు. త్వరలో ఈ కార్యక్రమానికి చెందిన అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది.


 

First published: June 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>