యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఏర్పాటు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే సినిమాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం మేరకు సినిమాను సంక్రాంతి సందర్బంగా జనవరి 14న విడుదల చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. సినిమా టైటిల్ విషయంలో త్రివిక్రమ్ ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటాడనే సంగతి మనకు తెలిసిందే. తన సినిమా టైటిల్స్‌కు అ అక్షరంతో వచ్చే టైటిల్స్‌నే ఎక్కువగా పెడుతుంటారాయన. కాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం గురూజీ తన సెంటిమెంట్‌ను పక్కన పెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది వరకు సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ త్రివిక్రమ్ ఎన్టీఆర్ 30కి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే రీసెంట్ టైమ్స్‌లో 'రాజా వచ్చినాడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో టైటిల్ పెడుతున్నాడని అంటున్నారు సినీ జనాలు. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలకు రెడ్డి, నాయుడు అనే టైటిల్స్‌ను ఫికస్్ చేసినట్లు ఈసారి త్రివిక్రమ్ తన సినిమాకు చౌడప్ప నాయుడు అనే టైటిల్‌ను ఖరారు చేశాడని అంటున్నారు. మరికొందరైతే బాబాయి బాలయ్యను ఎన్టీఆర్ ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుందని అంటున్నారు.
హరిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఇది. దీంతో సినిమాపై భారీ అంచనాలుంటాయనడంలో సందేహం లేదు.