Home /News /movies /

NTR FANS DEMANDS SAY SORRY FROM AP CM YS JAGAN SLB

సీఎం జగన్ సారీ చెప్పాలి! జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్.. రాసలీలల ఆడియోతో ట్రోల్స్

Photo Twitter

Photo Twitter

Ntr fans Vs Ambati Rambabu: వైసీపీ నేతలు, అంబటి రాంబాబుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తూ బహిరంగ క్షమాపణ కోరుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్‌కి, అంబటి రాంబాబుకు ఎక్కడ చెడింది? ఈ ట్రోల్స్ వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయానికొస్తే..

ఇంకా చదవండి ...
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Jr Ntr)పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు, అంబటి రాంబాబుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తూ బహిరంగ క్షమాపణ కోరుతున్నారు. ఇంతకీ ఎన్టీఆర్‌కి, అంబటి రాంబాబుకు ఎక్కడ చెడింది? ఈ ట్రోల్స్ వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయానికొస్తే.. ఓ సందర్భంలో మాటలో మాటగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బోనియ‌ర్ ఎన్టీఆర్ అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడి చిక్కుల్లో పడ్డారు అంబటి. ఫ్లోలో ఆయన మాట్లాడిన మాటలు రచ్చకు దారితీశాయి. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్ అభిమానులు వెంటనే సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసుతో జగన్ సారథ్యంలో నడుస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో మంత్రి అంబ‌టి రాంబాబు మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ రాష్ట్రానికి పట్టిన శని అని, ఇది మేము అంటున్న మాట కాదు.. లోకేష్ పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడని టీడీపీ పార్టీ నేతలే అంటున్నారంటూ ఫ్లోలో మాట్లాడారు మంత్రి అంబటి రాంబాబు. ఇదే ఎన్టీఆర్ అభిమానుల కోపానికి ప్రధాన కారణమైంది.


జూనియర్ ఎన్టీఆర్‌పై అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ మేరకు సోషల్ మీడియాను అస్త్రంగా వాడేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మీ పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్‌ని లాగితే ఉరుకునేదే లేదంటూ హెచ్చరిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు.. వెంటనే జగన్, రాంబాబు సారీ చెప్పాలని కామెంట్స్ చేస్తున్నారు. #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.


అంతటితో ఆగక మంత్రి అంబ‌టి రాంబాబు రాస‌లీల‌లు అంటూ ఓ ఆడియో టేప్‌ను వైరల్ చేస్తూ తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఓ మహిళతో అంబటి మాట్లాడుతున్నట్లుగా ఈ ఆడియో టేప్‌ ఉంది. అయితే అది అంబటి రాంబాబు గొంతేనా లేక మార్ఫింగ్ చేశారా అనేది మరో చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా అంబటి Vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ నడుమ నడుస్తున్న ఈ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సో.. చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Ambati rambabu, Ap cm jagan, Jr ntr, Ys jagan, Ys jagan mohan reddy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు