NTR - Evaru Meelo Koteeswaralu ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారమవుతోంది. ఈ షోలో ఎన్టీఆర్.. హాట్ సీట్‌లో ఉన్నకంటెస్టెంట్స్‌కు ప్రశ్నలు అడగటంతో పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాదు మధ్యలో తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ కంటెస్టెంట్స్‌తో కలిసి పోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమాలే కాదు.బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే.
ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో ప్రెజెంట్ నాల్గో సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.
తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ మొదటి వారం టీఆర్పీ రేటింగ్ అదరగొట్టింది. గతంలో నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేసినపుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్‌ను చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. తాజాగా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్ ప్రీమియర్ ఎసిపోడ్.. 11.40 రేటింగ్ సాధించింది.
Second Week Avg TRP :
NTR's #EMK In Gemini - 6.48 ?
Chiru's #MEK In StarMaa - 1.52 ?#EvaruMeeloKoteeswarulu#ManOfMassesNTR pic.twitter.com/pwMLI7biZK
— Hanu (@HanuViews) September 9, 2021
ఆ తర్వాత ఫస్ట్ వీక్.. 5.62 రేటింగ్ సాధించింది. రెండో వారం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్.. 6.48 రేటింగ్ సాధించింది. మొత్తంగా రెండో వారం స్మాల్ స్క్రీన్ పై ఎన్టీఆర్ తన సత్తా చూపెట్టారు. అంతేకాదు గతంలో ప్రసారమైన ఎపిసోడ్స్ ను తాజా ఎపిసోడ్స్‌ను అభిమానులు కంపేర్ చేస్తున్నారు.
#NTR's #EvaruMeeloKoteeswarulu Show TRP:
Premiere Episode - 11.4 [ATR for EMK Franchise in Telugu]
1st Week Average - 5.62 [ATR for EMK Franchise in Telugu]
2nd Week Average - 6.48 [ATR for EMK Franchise in Telugu]
The Best Host Ever @tarak9999 ?#ManOfMassesNTR pic.twitter.com/LEi5rhDOPG
— NTR Trends ? (@NTRFanTrends) September 9, 2021
మొత్తంగా టీవీల్లో ప్రసారమయ్యే ఇతర ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే.. ఇది తక్కువే అని చెప్పాలి. కానీ గతంలో ఈ ప్రోగ్రామ్ ప్రసారమైనపుడు వచ్చిన రేటింగ్స్‌కు .. ప్రస్తుతం వస్తోన్న రేటింగ్స్ చూస్తే.. ఇది ఎక్కువ అనే చెప్పాలి. ముందు ముందు ఎన్టీఆర్ ఈ షోను ఏ మేరకు సక్సెస్ చేస్తాడనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evaru Meelo Koteeswarulu, Jr ntr, RRR, Tollywood