NTR Evaru Meelo Koteeswarulu: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన వరుస ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులలో కూడా హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ షోతో సరికొత్త రికార్డును సృష్టించాడు.
ఈమధ్యనే జెమినీ ఛానల్ లో ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరులు షో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. పైగా రేటింగ్ కూడా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఈ షో ప్రారంభంలో రామ్ చరణ్ పాల్గొనగా బాగా సందడి చేశాడు. ఇక ఈ షో గతంలో స్టార్ మా లో ప్రసారమవ్వగా.. అందులో టాలీవుడ్ స్టార్ హీరోస్ నాగార్జున, చిరంజీవి హోస్టింగ్ చేశారు. కానీ ఆ సమయంలో ఈ షో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయేసరికి రేటింగ్ కూడా తక్కువగా ఉండేది. దీంతో ఈ షోను మళ్లీ ప్రారంభించడానికి ముందుకు కూడా రాలేదు.
ఇక ఈ ఏడాది ఈ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాగా అందులో హోస్టింగ్ కోసం ఎన్టీఆర్ ను ఎన్నుకున్నారు. ఎందుకంటే మరో రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించాడు. అంతేకాకుండా రేటింగ్ కూడా మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఈ షోను కూడా ఎన్టీఆర్ హోస్టింగ్ చేయాలని డిసైడ్ అవ్వడంతో ప్రేక్షకులు కూడా ఈ షో ప్రకటించినప్పటి నుంచి తెగ ఎదురు చూశారు.
దీంతో షో ప్రారంభం నుండి మంచి ఆదరణ లభించగా.. ప్రారంభం నుండి ఈ షో రేటింగ్ తో బాగా దూసుకుపోతుంది. తాజాగా ఈ షో రేటింగ్ బయటకు రాగా దాదాపు 11.40 టీఆర్పీ దక్కింది. ఇప్పటివరకు ఈ షో ఇంత రేటింగ్ అందుకోకపోగా.. ఈ రేటింగ్ తో ఎన్టీఆర్ సరికొత్త రికార్డును సంపాదించాడని చెప్పవచ్చు. పైగా ఎన్టీఆర్ షో మధ్యలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ప్రేక్షకుల తనవైపుకు తిప్పుకుంటున్నాడు ఎన్టీఆర్. మొత్తానికి ఈ సీజన్ ను ఎన్టీఆర్ ఊహించని స్థాయిలో నడిపిస్తున్నాడు అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Evaru Meelo Koteeswarulu, Megastar Chiranjeevi, NTR, Tollywood