NTR - Evaru Meelo Koteeswarulu : ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలీటీ షో పై బిగ్ అప్డేట్.. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు చిన్న ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్లో సినిమాలే కాదు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ వంటి ఫిక్షనల్ హిస్టారికల్ మూవీతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో, నాల్గో సీజన్లను నాగార్జున హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు ఐదో సీజన్‌ను కూడా నాగార్జున హోస్ట్ చేయనున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ కృష్ణ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేసారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ప్రోగ్రామ్‌తో సామాన్యులకు మరింత దగ్గరయ్యే అవకాశం తనకు దక్కడం ఎంతో అదృష్టమన్నారు. ఎపుడో టెలికాస్ట్ కావాల్సిన ఈ షో .. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. తాజాగా షోను ఆగష్టు నుంచే ప్రసారం చేయనున్నట్టు ప్రకటించడంతో పాటు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో ఓ టీచర్ క్లాసులో పిల్లలను ఉద్దేశిస్తూ.. మీరు పెద్దయ్యాక ఏం అవుతారు అన్న ప్రశ్నకు ఒకరు కలెక్టర్ అవుతాను అంటే.. మరొకరు పైలట్ అని.. ఇంకొకరు ఛీఫ్ మినిష్టర్ అవుతాను చెబుతారు. కానీ ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుదామనుకుంటున్నాను అంటూ సమాధానిమిచ్చి టీజర్‌తో పాటు మిగతా వాళ్లు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. కట్ చేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక నువ్వు ఏమైవుదానుకుంటున్నావు అనే ప్రశ్నకు ఓ విద్యార్ధిని నేను సీఏ చేస్తానంటోంది. కానీ అదే అమ్మాయి.. అమ్మను అవుతాను అంటూ చెబుతుంది. తీరా షోలో ఎన్టీఆర్ అదే అమ్మాయిని మీరు ఏమవుదామనుకుంటున్నారు అనే ప్రశ్నకు నేను అమ్మను అవుతాను అంటూ సమాధానమిస్తోంది. మేము ముగ్గురుం ఆడపిల్లము.. అంటూ తన తల్లి పడిన కష్టాన్ని చెబుతోంది. ఈ సందర్భంగా రేపటి తరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యమంటూ సమాధానమివ్వడం ఆకట్టుకుంది. ఇక్కడ మనీతో పాటు మనసులు గెలుచుకోవచ్చు అంటూ ఎన్టీఆర్ చెబుతూనే.. ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది .. కోటి మీది .. రండి మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ కాస్త ఎమోషనల్‌గా ఉంది ఈ ప్రోమో.
డేట్ ప్రకటించిక పోయినా.. ఆగష్టు 15 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. ‘ఎవరు మీలో కోటీశ్వురులు’ ఒక్కో ఎపిసోడ్ కోసం దాదాపు రూ. 1.2 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీజన్ 1 కోసం 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ సీజన్లోనే రూ. 30 కోట్లకు పైగా తారక్ పారితోషికంగా తీసుకోబోతున్నాడన్నమాట. ఐతే.. ఈ షో విషయంలో ఎన్టీఆర్ ముందు పెద్ద టార్గెట్ ఉంది. ఇప్పటి వరకు స్టార్ మా ఛానెల్లో ఇప్పటి వరకు మూడు సీజన్లు ప్రసారం అయ్యాయి. నాగార్జున హోస్ట్ చేసిన రెండు సీజన్లు సక్సెస్ అయితే.. చిరంజీవి చేసిన సీజన్ 3 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్ వాళ్లు ఈ ప్రోగ్రామ్ పై పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో జెమిని టీవీ వాళ్లు ఎన్టీఆర్‌తో ఈ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసారు. మరి ఎన్టీఆర్ తన యాంకరింగ్‌తో ఈ షోకు హైయ్యెస్ట్ టీఆర్పీ సాధించడంలో ఏ మేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్లో రామ్ చరణ్ .. హాట్ సీట్లో కనిపించనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.