NTR - Evaru Meelo Koteeswarulu: మరో ఎమోషనల్ టచ్ ఇచ్చిన మీలో ఎవరు కోటిశ్వరుడు.. ఈసారి మరింత సరికొత్తగా?

NTR - Evaru Meelo Koteeswarulu

NTR - Evaru Meelo Koteeswarulu: టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బుల్లితెరలో రియాలిటీ షో మీలో ఎవరు కోటీశ్వరులు కు హోస్టింగ్ చేయనున్నాడు.

  • Share this:
    NTR - Evaru Meelo Koteeswarulu: టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బుల్లితెరలో రియాలిటీ షో మీలో ఎవరు కోటీశ్వరులు కు హోస్టింగ్ చేయనున్నాడు. ఈసారి ఈ షో స్టార్ మాలో కాకుండా జెమినీ ఛానల్ లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన చిన్న ప్రోమో కూడా విడుదలైంది. ప్రస్తుతం ఆఫ్ లైన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ షో పాల్గొనే కంటెస్టెంట్ ల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లను కూడా పూర్తి చేశారని సమాచారం. స్టార్ మా లో ప్రసారమైన సమయంలో నాగార్జున, చిరంజీవి హోస్టింగ్ చేసి మంచి క్రేజ్ ను అందించారు. ఇక ఎన్టీఆర్ తో కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈసారి సరికొత్తగా మరో ఎమోషనల్ టచ్ ఉంటుందని తెలుస్తుంది.

    ఇప్పటికే ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకోగా త్వరలో మిగతా సినిమా షూటింగ్ కోసం సెట్ లో కూడా వెళ్లనున్నాడు. దీంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఎన్టీఆర్ తో ఉండే కొన్ని సన్నివేశాలు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.

    ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తనకు కాస్త బ్రేక్ రావడంతో ఆ బ్రేక్ సమయంలో మీలో ఎవరు కోటీశ్వరులకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్ లను పూర్తి చేశారు. ఇక ఈ సారి ఈ షో మరింత కొత్తదనంతో ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ముందుకు రానుంది. అంతేకాకుండా కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ షోకి సంబంధించిన మరో ప్రోమో విడుదలయింది.

    అందులో ఒక అమ్మాయి తనకు భవిష్యత్తులో ఒక లక్ష్యం అనేది ఉందని దానికోసమే పోరాడుతుంది అన్నట్లు చూపించగా.. ఇదివరకే మరో ప్రోమో కూడా విడుదల చేశారు. దీంతో ఇవన్నీ కాస్త ఎమోషనల్ గా ఉండటంతో వీటిని ప్రతి ఎపిసోడ్ లో ఓ పక్క గేమ్ తో పాటు.. మరోపక్క ఇటువంటి ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: