• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NTR EID WISHES AND TWEETS ABOUT HIS HEALTH SR

NTR Health : కరోనా నుంచి కోలుకుంటున్న ఎన్టీఆర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్..

NTR Health : కరోనా నుంచి కోలుకుంటున్న ఎన్టీఆర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్..

NTR Photo : Twitter

NTR Health : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంజాన్ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తన ఆరోగ్యం కూడా కుదుట పడుతోందని తెలిపారు.

  • Share this:
    యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంజాన్ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తన ఆరోగ్యం కూడా కుదుట పడుతోందని తెలిపారు. ఎన్టీఆర్ ఇటీవల కరోనా వైరస్ బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన ఆరోగ్యం కూడా బాగానే ఉందని కరోనా నుంచి కోలుకుంటున్నానని ఎన్టీఆర్ చెప్పారు. అంతేకాదు త్వరలోనే నెగెటివ్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఈ నెల 10న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకినట్టు తెలిసిన వెంటనే ఆయన హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇక్కడ మరో విషయం ఏమంటే ఎన్టీఆర్‌కు మాత్రమే కాకుండా ఇంట్లో పిల్లలకు కూడా కరోనా సోకిందని అంటున్నారు. దీనిపై కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కరోనా బారీన పడడంతో వైద్యుల సూచనలను పాటిస్తూ, ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు, చిరంజీవి, నారా లోకేష్, మహేష్ బాబు వంటి ప్రముఖులు ట్వీట్స్ చేసారు.

    ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం అగ్ర దర్శకుడు రాజమౌళితో దర్శకత్వంలో వస్తోన్న ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో ప్రధానపాత్రలో కనిపించనున్నాడు.


    ఈ సినిమా తర్వత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉండగా.. ఆ సినిమా కొన్ని కారణాల వలన ముందుకు పోలేదు. దీంతో ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడని ఆ మధ్య ఓ వార్త రాగా ఆ విషయంపై ఎన్టీఆర్ తాజాగా స్పష్టతనిచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అంతేకాదు ఆ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించిన సంగతి తెలిసిందే.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు