Home /News /movies /

NTR DEATH ANNIVERSARY RRR FAME JR NTR KALYAN RAM REMEMBERS NTR ON HIS DEATH ANNIVERSARY TA

NTR Death Anniversary : తాత ఎన్టీఆర్‌కు ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ (Twitter/Photo)

ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ (Twitter/Photo)

మ‌హా నాయ‌కుడు, న‌ట‌సార్వ‌భౌమ, దివంగత ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్(NTR) 26వ వ‌ర్ధంతి నేడు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు నంద‌మూరి కుటుంబీకులు మహానటుడికి నివాళులు అర్పిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  NTR Death Anniversary  | మ‌హా నాయ‌కుడు, న‌ట‌సార్వ‌భౌమ, దివంగత ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ 26వ వ‌ర్ధంతి నేడు. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఆయ‌న సేవ‌ల‌ను గుర్తు చేసుకుంటున్నారు. మ‌రోవైపు నంద‌మూరి కుటుంబీకులు ఆయ‌న‌కు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లిన న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ నంద‌మూరి హీరోలు ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్‌లు తాత ఎన్టీఆర్‌ను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

  ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ .. ధ్రువ తార మీరే అంటూ తాతతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకొన  కాస్తంత ఎమోషనల్ అయ్యారు. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ ‘జోహార్ ఎన్టీఆర్’ అంటూ తన తాత నానమ్మల ఫోటోను షేర్ చేసారు.
  కాగా తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్. కేవ‌లం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించారు ఈ బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఆయ‌న‌. ప‌ల్లెటూరి పిల్ల చిత్రంలో మొద‌ట ఎన్టీఆర్‌కి అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఆ సినిమా విడుద‌ల ఆల‌స్యం కాగా.. ఆయ‌న న‌టించిన మ‌న‌దేశం మొద‌ట‌గా తెరమీదికి వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి వెన‌క్కి తిర‌గ‌ని ఎన్టీఆర్.. వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఇలా తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాల్లో న‌టించారు. అప్ప‌ట్లో యేడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి.

  NTR Death Anniversary : నేడు అన్న ఎన్టీఆర్ 26వ వర్థంతి.. నటనలో, రాజకీయాల్లో అన్నగారి రూటే సెపరేటు..


  అంతేకాదు దర్శ‌కుడిగానే ఆయ‌న త‌న‌లోని టాలెంట్‌ని నిరూపించుకున్నారు. ద‌ర్శ‌కుడిగా తాను న‌టించిన ప‌లు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఎన్టీఆర్. అందులో దాన వీర సూర క‌ర్ణ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేనిది. ఆ సినిమాలో శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్ర‌లు పోషించారు ఎన్టీఆర్. ఇక దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసి అఖండ విజయం సాధించింది.

  Dhanush Aishwarya Divorce : నాగ చైతన్య, సమంత బాటలో విడాకులు తీసుకున్న ధనుశ్, ఐశ్యర్య దంపతులు..


  అంతేకాదు ఎన్నో చిత్రాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభిన‌యం చేశారు. కొన్ని చిత్రాల్లో ఐదు అవ‌త‌రాల్లోనూ క‌నిపించారు. ఆ త‌రువాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు.

  Hero As Film Industry Based Movie : అశోక్ గల్లా ’హీరో’ మూవీ సహా తెలుగులో సినీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..


  ఇక ముఖ్యమంత్రిగా పదవిలో కొన‌సాగుతున్న‌ప్పుడు కూడా ఆయన ప‌లు చిత్రాలు నిర్మించ‌డంతో పాటు అందులో న‌టించారు. ఇలా తన 44 ఏళ్ళ సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై చెరగని ముద్ర వేసారు. అంతేకాదు హిందీలో ‘నయా ఆద్మీ’ ‘చండీరాణి’ అనే రెండు సినిమాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. అలాగే ముఖ్య‌మంత్రిగా ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ఎంతోమంది ఇన్ఫిరేష‌న్‌గా మారారు ఎన్టీఆర్.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jr ntr, Kalyan Ram Nandamuri, NTR, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు