Home /News /movies /

NTR DAUGHTER UMA MAHESWARI PASSED AWAY SB

Ntr: ఎన్టీఆర్ ఇంట తీవ్ర విషాదం... కూతురు హఠాన్మరణం.. !

ఎన్టీఆర్​  (Twitter/Photo)

ఎన్టీఆర్​ (Twitter/Photo)

ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది.

    దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూతురు అకస్మాత్తుగా మరణించారు. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ మృతి చెందారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. ఉమామహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఈ లోపే ఇంతటి విషాదం జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

    ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. వీళ్ళలో కొందరు మనకు తెలుసు హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం సైతం అందరికి తెలిసిందే. ఇక కూతుళ్లు, భువనేశ్వరి, పురంధేశ్వరి గురించి కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ మరో కూతురు  కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ.

    అయితే అందరి జీవితాలు సాఫీగా సాగిపోతున్నా.. చిన్నకూతురు ఉమామహేశ్వరి జీవితం మాత్రం చాలా విషాదంగా నిండింది. ఉమామహేశ్వరిని నరేంద్ర రాజన్ అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసాడు ఎన్టీఆర్. అయితే అయన చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేసేవాడని, సిగరేట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ళ నాన్న అయినా ఎన్టీఆర్ కి చెప్పింది. దీంతో అతడితో విడాకులు ఇప్పించి ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు ఎన్టీఆర్.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hyderabad, NTR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు