హోమ్ /వార్తలు /సినిమా /

NTR Birth Anniversary: ఎన్టీఆర్ జయంతి రోజున బాలకృష్ణ ఇచ్చే సర్‌ఫ్రైజ్ ఇదే..

NTR Birth Anniversary: ఎన్టీఆర్ జయంతి రోజున బాలకృష్ణ ఇచ్చే సర్‌ఫ్రైజ్ ఇదే..

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య సర్ఫ్రైజ్ గిఫ్ట్ (Twitter/Photo)

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య సర్ఫ్రైజ్ గిఫ్ట్ (Twitter/Photo)

NTR Birth Anniversary: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు ఆయనకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

  NTR Birth Anniversary: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు ఆయనకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలకృష్ణ తాను స్వయంగా పాడిన శ్రీరామ దండకం పాటను అభిమానుల కోసం ఉదయం 9.45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు పండగ లాంటిది. ఈ సందర్భంగా బాలయ్య తాను స్వయంగా ఆలపించిన శ్రీరామ దండకం రేపు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  ముందుగా ఎన్టీఆర్ జయంతి సందర్బంగా తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.

  ఐతే.. బాలయ్య స్పెషల్ అప్డేట్ అంటే.. తన తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఏమన్నా క్లారిటీ ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ బాలయ్య మాత్రం శ్రీరామ దండకం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా నుంచి బాలయ్య తనయుడి ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా తన తనయుడి ఎంట్రీ ఉంటుందని ఎన్నో సార్లు చెప్పారు. దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.మరి వచ్చే నెల 10న బాలయ్య పుట్టినరోజున మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత సినిమా ఉండనుంది. ఆపై అనిల్ రావిపూడితో సినిమా కూడా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK, NTR, Tollywood

  ఉత్తమ కథలు