ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు(Ntr Birth Anniversary) శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కి వెళ్లి నివాళులర్పిస్తున్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం వేకువజామునే... జూనియర్ ఎన్టీఆర్.. తాత ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. తన అన్న కళ్యాణ్ రామ్‌తో కలిసి.. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లారు. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్‌తో పాటు.. లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ట్విట్ర్ వేదికగా ట్వీట్ చేశారు. సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ.. తాతగారి ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోపై అద్భుతమైన కవిత కూడా రాశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.మీ రూపు
కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో మరొక్కసారి ఈ ధరిత్రిని, ఈ గుండెను తాకిపో తాతా... నీ ప్రేమకు బానిసను అంటూ.. ఎన్టీఆర్ తన సంతకంతో కూడిన ఫోటోను షేర్ చేశాడు.
ఇక నందమూరి తారక రామారావు ( NTR ) శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మొదలైన హడావుడి. ఈమేరకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు ఎన్‌టీఆర్ అని, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకులుగా పేరుగాంచారని తెలిపారు. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్ టీ ఆర్ పేరు ఉంటుందని ఆమె అన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.#NTR #JoharNTR #NTRJayanthi @tarak9999 @NANDAMURIKALYAN pic.twitter.com/TOtNRSLpKW
— BA Raju's Team (@baraju_SuperHit) May 28, 2022
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను బాలకృష్ణ తాజాగా విడుదల చేశారు. ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట తన తండ్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు బాలయ్య తెలిపారు.
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022
శత జయంతి ఉత్సవాలను మే 28 నుంచి ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తమ కుటుంబం నుంచి నెలకు ఒకరుచొప్పున పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయన్నారు. అలాగే నెలకు 2 ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మొదలవుతాయని బాలకృష్ణ తెలిపారు.
ఇవాళ ఉదయం తమ స్వస్థలం నిమ్మకూరులో జరిగే జయంతి వేడుకల్లో తాను స్వయంగా పాల్గొంటానని బాలకృష్ణ వెల్లడించారు. తమ నాన్నగారిని వందేళ్ల క్రితం జాతికందించిన స్థలం కావడంతో ఇది తన బాధ్యత అని బాలయ్య అన్నారు. అక్కడి నుండి తెనాలి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన శతాబ్ది వేడుకలను బాలయ్య ప్రారంభిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Lakshmi Parvathi, NTR