NTR: బిగ్‌బాస్ షో కంటే ముందు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన టీవీ సీరియల్ ఇదే..

జూ ఎన్టీఆర్ బిగ్‌బాస్ (File/Photo)

Jr NTR Bigg Boss Serial | టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తారక్ బిగ్‌బాస్ వంటి రియాలిటీ షో కంటే ముందు మరో తెలుగు సీరియల్‌లో నటించాడు.

  • Share this:
    టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో సినిమాలే కాదు. బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్‌గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈయన బిగ్‌బాస్ తర్వాత సీజన్స్‌కు హోస్ట్‌గా కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్ ప్లేస్‌లో సెకండ్ సీజన్‌ను నాని హోస్ట్ చేస్తే.. మూడో సీజన్‌తో పాటు నాల్గో సీజన్‌ను నాగార్జున హోస్ట్‌ చేస్తున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. ఇన్నేళ్ల కెరీర్‌లో 30 సినిమాలకు చేరువైన ఎన్టీఆర్... త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్రతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక బిగ్‌బాస్ షో కాకుండా తారక్ స్మాల్ స్క్రీన్ పై ఓ సీరియల్ కూడా చేసాడు. ఈ సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.

    జూనియర్ ఎన్టీఆర్ భక్త మార్కండేయ సీరియల్‌లోని వేషం (jr ntr rare photos/Twitter/Facebook)


    చిన్నపుడు గుణశేఖర్ దర్శకత్వంలో అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ సినిమాలో ఎన్టీఆర్ బాల రాముడి పాత్రలో అలరించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ చదువులో పడిపోయాడు ఎన్టీఆర్.  ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘నిన్ను చూడాలని’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఆ సినిమా కంటే  ముందే.. ఎన్టీఆర్ ఓ టెలి సిరీయల్‌లో నటించాడు. ఈ సీరియల్ పేరు ‘భక్త మార్కండేయ’. ఈ సీరియల్‌లో ఎన్టీఆర్ టైటిల్ రోల్  భక్త మార్కండేయుని పాత్రలో నటించాడు. ఈ సీరియల్ అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ తర్వాత ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో నాల్గోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌తో పాటు అట్లీ దర్శకత్వంలో వరుస సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దసరా సందర్భంగా విడుదలైన కొమరం భీమ్ టీజర్‌కు ప్రశంసలతో పాటు అంతేస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాపై ప్యాన్ ఇండియా లెవల్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: