సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే అపాయం ఉందన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రముఖ టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ ఓ వీడియో తెలిపే ప్రయత్నం చేశాడు. తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్బుక్లో మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. సోషల్ మీడియాలో పరిచయమై ఆ తర్వాత ఎవరైనా మహిళలు మోసగాళ్ల బారినపడితే భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అయినా ఫేస్ బుక్ , ట్విట్టర్ , ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా కొంతమంది నేరస్తులు మహిళలను , కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసి పలురకాల నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి నేరగాళ్ల బారిన పడకూడదని తెలంగాణ పోలీసులు రూపొందించిన ఓ వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేశాడు. దీనికి సంబంధించిన ఆ వీడియోను తెలంగాణ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. జనాలను ముఖ్యంగా మహిళలకు అవగాహాన కల్పించే ప్రయత్నం చేశారు.
సైబర్ ముఠాలు, సైబర్ ప్రేమికులు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, ఫోన్ నంబరు తీసుకుంటారని, ఆపై ప్రేమ పేరుతో వల విసురుతారని, ఆ తర్వాత ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు అగుడుతారని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలనీ, ఇలాంటి ఫేస్బుక్ పరిచయాలు, ప్రేమలకు దూరంగా ఉండాలని సూచిస్తూ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు.
చెల్లమ్మా నికే చెప్తున నా మాట విను.
ఫేస్ బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త. pic.twitter.com/GxVC9Zb6w2
— Telangana State Police (@TelanganaCOPs) January 4, 2021
ఇక ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఇలా ఓ మంచి వీడియోను ప్రజల శ్రేయస్సుకోరి చేయడం.. ఆ మెసేజ్‌ను ఓ సినీ నటునితో ముందుకు తీసుకుపోవడం మంచి పరిణామమని.. ఇది ఎంతో మందికి అవగాహాన కల్పిస్తుంది. ఖచ్చితంగా కొందరైనా మహిళలు ఈ వీడియోను చూసి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉంటారని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. తెలంగాణ పోలీసులు చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ ధన్య వాదాలు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Telangana, Telangana Police