అరవింద సమేతకు అది ప్లస్ అవుతుందా..!

ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాల 30 సెకండ్లు ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

news18-telugu
Updated: October 9, 2018, 11:33 AM IST
అరవింద సమేతకు అది ప్లస్ అవుతుందా..!
రూ.15 లక్షల విరాళం ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్
  • Share this:
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ మూవీలో తారక్ సరసన పూజా హెగ్డే, ఈశా రెబ్బాలు హీరోయిన్స్‌గా నటించారు.

ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాల 30 సెకండ్లు ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఏపీ గవర్నమెంట్ అరవింద సమేతకు వారం రోజుల పాటు ఆరు షోలు వేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ మూవీ థియోట్రికల్ రైట్స్ రూ.93 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షో టిక్కెట్స్ హాటు కేకుల్లా అమ్ముడుపోయాయి. అక్టోబర్ 11న అరవింద సమేతంగా వీరరాఘవగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 9, 2018, 11:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading