మూవీరివ్యూ: ’అరవింద సమేత వీరరాఘవ‘ సత్తా చూపించాడా..?

ఎన్టీఆర్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్న అర‌వింద స‌మేత రానే వ‌చ్చింది. మ‌రి ఈ వీర‌రాఘ‌వుడి ప్ర‌తాపం బాక్సాపీస్ ద‌గ్గ‌ర ఎలా ఉంది..? ఈ సినిమా నిజంగానే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా.. లేదా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2018, 1:04 PM IST
మూవీరివ్యూ: ’అరవింద సమేత వీరరాఘవ‘ సత్తా చూపించాడా..?
అర‌వింద స‌మేత‌
  • Share this:
రివ్యూ: అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌
న‌టీన‌టులు: ఎన్టీఆర్, పూజాహెగ్డే, ఇషారెబ్బా,సునీల్, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, న‌వీన్ చంద్ర‌ త‌దిత‌రులు
రేటింగ్: 2.75/5

నిడివి: 2 గంట‌ల 47 నిమిషాలు
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఎడిట‌ర్: న‌వీన్ నూలి


సినిమాటోగ్ర‌ఫీ: పిఎస్ వినోద్నిర్మాత‌: రాధాకృష్ణ
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: త‌్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్

ఎన్టీఆర్ అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూస్తున్న అర‌వింద స‌మేత రానే వ‌చ్చింది. మ‌రి ఈ వీర‌రాఘ‌వుడి ప్ర‌తాపం బాక్సాపీస్ ద‌గ్గ‌ర ఎలా ఉంది..? ఈ సినిమా నిజంగానే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా.. లేదా..?

క‌థ‌:
బ‌సిరెడ్డి(జ‌గ‌ప‌తిబాబు), నార‌పురెడ్డి(నాగ‌బాబు) క‌రుడు గ‌ట్టిన ఫ్యాక్ష‌నిస్టులు. రెండూళ్ల‌లో ఒక‌ర్నొక‌రు చంపుకుంటూనే ఉంటారు. 30 ఏళ్లుగా ఉన్న పగ‌ల మ‌ధ్య‌లోకి లండ‌న్ లో చ‌దువుకుని అప్పుడే ఊరికి వ‌స్తాడు నార‌పురెడ్డి కొడుకు వీర‌రాఘ‌వ‌రెడ్డి(ఎన్టీఆర్). వ‌చ్చీ రావ‌డంతోనే వాళ్ల‌పై అటాక్ జ‌రుగుతుంది. ఆ గొడ‌వ‌లోనే త‌న తండ్రిని కోల్పోతాడు. అప్పుడే నిర్ణ‌యించుకుంటాడు సీమ‌లో ప‌గ‌లు కాదు.. ప్రేమ కావాల‌ని. అందుకే ఇళ్లు వ‌దిలేసి వెళ్లిపోతాడు. ఆయ‌నకి ఈ ప్ర‌యాణంలో అర‌వింద (పూజాహెగ్డే) క‌లుస్తుంది. అప్ప‌ట్నుంచి అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ ఏం చేసాడ‌నేది క‌థ‌.

విశ్లేష‌ణ‌:
త్రివిక్ర‌మ్ సినిమా అంటే ముందుగా అంద‌రూ ఊహించేది డైలాగ్స్. ఆ త‌ర్వాత కామెడీ.. ఆ త‌ర్వాతే మిగిలిన‌వి. కానీ అజ్ఞాతవాసిలో ఇందులో ఏ ఒక్క‌టి కూడా అంద‌లేదు. అందుకే దారుణంగా నిరాశ ప‌డ్డారు అభిమానులు. ఆ చేదు జ్ఞాప‌కం మ‌రిపించ‌డానికి ఇప్పుడు అరవింద స‌మేత‌తో వ‌చ్చేసాడు త్రివిక్ర‌మ్. అయితే ఇందులో కూడా కామెడీ లేదు. ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్ సినిమాల్లో క‌నిపించే చ‌మ‌క్కులు ఇందులో లేవు.. కానీ క‌థ ఉంది. తొలి సీన్ నుంచే క‌థ‌ను గాడి త‌ప్ప‌కుండా డిజైన్ చేసుకున్నాడు త్రివిక్ర‌మ్. అస‌లు హీరో ఇంట్రో సీన్ ను ఇంత భారీగా ప్లాన్ చేసిన తెలుగు సినిమా ఈ మ‌ధ్య కాలంలో అయితే ఏదీ లేదేమో..? అస‌లు తొలి 20 నిమిషాల్లోనే అభిమానుల‌కు పూన‌కాలు తెప్పించాడు త్రివిక్ర‌మ్. అదే టెంపో మ‌రో 20 నిమిషాలు సాగింది. అయితే ఎప్పుడైతే శాంతి కావాలంటూ సిటీకి వ‌చ్చి పూజాహెగ్డేను క‌లిసాడో అప్ప‌ట్నుంచి క‌థ కాస్త నెమ్మ‌దించింది.
కామెడీ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. న‌రేష్, సునీల్ లాంటి వాళ్లు ఉన్నా కూడా ఎందుకో కానీ ఎంట‌ర్ టైన్మెంట్ అంద‌లేదు. కానీ ఇంట‌ర్వెల్ సీన్ నుంచి మ‌ళ్లీ ఊపందుకుంది సినిమా. అక్క‌డ్నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు ఎమోష‌న‌ల్ కంటెంట్ న‌మ్ముకున్నాడు త్రివిక్ర‌మ్. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తానికి కాంప్రమైజ్ సీన్ హైలైట్. ఇది సినిమాకు మేజర్ హైలైట్స్ లో ఒకటి. కానీ నిజంగా ఇప్పుడు ఇంత హింస ఉందా.. అస‌లు రాయ‌ల‌సీమ‌లో ఇంత ఫ్యాక్ష‌నిజం ఇప్పుడు లేదు క‌దా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం ఇప్పుడు ఏదో కొత్త‌గా చెప్పాల‌ని చూసాడు. స్క్రీన్ ప్లే ప్ల‌స్ ఎన్టీఆర్ స్క్రీన్ అప్పియ‌రెన్స్.. సెకండాఫ్ ఎమోష‌న‌ల్ కంటెంట్.. తొలి 20 నిమిషాల‌తో అది వ‌ర్క‌వుట్ అయిపోయింది. ఫ్యాన్స్ కు ఈ ద‌స‌రాకు ట్రీట్ ఇచ్చాడు ఎన్టీఆర్. నార్మ‌ల్ ఆడియ‌న్స్ కు మాత్రం యావ‌రేజ్ సినిమానే.

న‌టీన‌టులు:
ఎన్టీఆర్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మాయ చేసాడు. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో ల‌వ‌ర్ బాయ్.. సెకండాఫ్ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ గా ర‌ప్ఫాడించాడు. ఆయ‌న న‌ట‌న గురించి కొత్త‌గా చెప్ప‌డానికేం లేదు. త్రివిక్ర‌మ్ ఊహించిన దానికంటే ఎక్కువే చేసాడు. ఇక ఎమోష‌న‌ల్ సీన్స్ లో అయితే చెప్ప‌డానికి మాట‌లు లేవు. పూజాహెగ్డే కెరీర్ లో తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకుంది. చాలా బాగా చెప్పింది. తెలుగు అక్క‌డ‌క్క‌డా పోయినా కూడా అర్థ‌మ‌య్యేలా మాట్లాడింది. పూజా చెల్లిగా ఇషారెబ్బా ప‌ర్లేదు. చాలా ఏళ్ళ త‌ర్వాత సునీల్ త‌న మార్క్ చూపించాడు. ఇన్నాళ్లూ మిస్ అయింది ఈ చిత్రంతో సునీల్ కు మ‌రోసారి అర్థ‌మైపోయింది. విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు రాక్ష‌సంగా ఉన్నాడు. ఈయ‌న పాత్ర‌ను కూడా అలాగే డిజైన్ చేసాడు త్రివిక్ర‌మ్. నాగ‌బాబు, న‌వీన్ చంద్ర, సుప్రియ ప‌గ‌త్ లాంటి వాళ్లు బాగా న‌టించారు.

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ మ్యూజిక్ సినిమాకు ఊహించుకున్నంత అయితే లేదు. పాట‌లు బాగోలేక‌పోయినా కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్ లో చాలా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు థ‌మ‌న్. రెడ్డి ఇక్క‌డ సూడు, అన‌గ‌నగా పాట‌లు అభిమానుల‌కు పండ‌గే. పిఎస్ వినోద్ త‌న ప‌ని ప‌ర్ఫెక్ట్ గా చేసాడు. న‌వీన్ నూలి ఎడిటింగ్ ప‌ర్లేదు. అయితే నిడివి విష‌యంలో కాస్త జాగ్ర‌త్త ప‌డాల్సింది. రెండు గంట‌ల 47 నిమిషాలు అక్క‌డ‌క్క‌డా స్లో అయింది సినిమా. రాధాకృష్ణ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి. ఇక త్రివిక్ర‌మ్ కూడా మ‌రోసారి త‌న స‌త్తా చూపించాడు. ఈయ‌న చాలా కూల్ గా ఒక్క ఫ్లాప్ తో పోయేదేం లేద‌న్న‌ట్లు 9 నెల‌ల్లోనే బౌన్స్ బ్యాక్ ఇచ్చి త‌న‌ను త‌క్కువ అంచ‌నా వేసిన వాళ్ల‌కు త‌నేంటో చూపించాల‌నుకున్నాడు. ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయినా మున‌ప‌టి త్రివిక్ర‌మ్ క‌నిపించ‌లేదు.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌.. అభిమానుల‌కు పండ‌గే..
First published: October 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>