Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 14, 2018, 11:32 AM IST
అరవింద సమేత
మూడు రోజుల్లోనే 100 కోట్లు.. బాలీవుడ్ సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే రికార్డులవి. కానీ ఇప్పుడు మన సినిమాలు కూడా చేసి చూపిస్తున్నాయి. వరసగా మూడోసారి ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఈయన నటించిన "అరవింద సమేత" మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమా తొలిరోజు నుంచే సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. తొలిరోజు 60 కోట్లు.. రెండు మూడు రోజుల్లో 40 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం.

అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్
మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకుని.. షేర్ కూడా దాదాపు 60 కోట్లకు చేరువగా వచ్చింది. రెండేళ్ల కింద "జనతా గ్యారేజ్"తో 100 కోట్ల రచ్చ మొదలుపెట్టాడు ఎన్టీఆర్.. ఏడాది "జై లవకుశ"తో మరోసారి 100 కోట్లు అందుకున్నాడు.. ఇక ఇప్పుడు "అరవింద సమేత"తో వరసగా మూడోసారి 100 కోట్ల మార్క్ అందుకుని అద్భుతం చేసాడు. అలాగే ఓవర్సీస్ లో కూడా వరసగా నాలుగో సారి 1.5 మిలియన్ దాటేసాడు జూనియర్.

జనతా గ్యారేజ్ జైలవకుశ
ఓవర్సీస్లో యంగ్ టైగర్ రికార్డులకు హద్దే లేకుండా పోతుంది. ఈయన ప్రతీ సారి రావడం.. రికార్డులు తిరగరాయడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగులో వరసగా మూడు సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టిన హీరో కూడా లేడు.. తొలిసారి ఆ అద్భుతం చేసింది ఎన్టీఆరే. మొత్తానికి "అరవింద సమేత వీరరాఘవ"తో ఎన్టీఆర్ పరాక్రమం సాగుతుంది.. ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలిక..!
Published by:
Praveen Kumar Vadla
First published:
October 14, 2018, 11:32 AM IST