ఎన్టీఆర్ సరసన మళ్లీ ఆమెనట.. సమ్మర్‌కు ప్లాన్ చేస్తోన్న త్రివిక్రమ్..

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 6, 2020, 7:06 AM IST
ఎన్టీఆర్ సరసన మళ్లీ ఆమెనట.. సమ్మర్‌కు ప్లాన్ చేస్తోన్న త్రివిక్రమ్..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
  • Share this:
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడు. ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఛాన్స్ ఉందట. అందులో ఒక హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట. ఇక మరో హీరోయిన్‌గా మరోసారి పూజా హెగ్డేనే తీసుకోవాలనీ భావిస్తోందట చిత్రబృందం. త్రివిక్రమ్ తన గత రెండు సినిమాల్లోను పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలోను ఆమెనే తీసుకునే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. కారణం ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. దీంతో ఆమెవైపే చూస్తున్నాడట. ఇక సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Published by: Suresh Rachamalla
First published: April 6, 2020, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading