Ntr 30- Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ ఫుల్ డీటైల్స్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసిందహో!

Ntr and Trivikram movie release date fixed full details here

Ntr 30- Trivikram: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా ప్రారంభం కాకుండానే రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి

 • Share this:
  ‘అరవింద సమేత వీర రాఘవ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చి చాలారోజులే అయ్యింది. దీంతో అప్డేట్‌ కోసం వేచి చూస్తున్న నందమూరి, మాటల మాంత్రికుడు అభిమానులకు పండగ చేసుకునే వార్తే ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ డీటైల్స్.. అంటే సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుంది..? ఎన్టీఆర్ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారు..? జూనియర్‌తో రొమాన్స్ చేసే బ్యూటీ ఎవరు..? టైటిల్ ఏమనుకుంటున్నారు..? ఏది ఫైనల్ అయ్యింది..? రిలీజ్ ఎప్పుడు..? అనేది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

  షూటింగ్, షెడ్యూల్!
  షూటింగ్, జూనియర్ షెడ్యూల్ విషయానికొస్తే.. తెలుగువారి మొదటి పండుగ అయిన ఉగాది రోజున అనగా ఏప్రిల్-13న షూటింగ్ ప్రారంభించాలని చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మే, జూన్ నెలల్లో సినిమా కోసం పూర్తిగా హీరో డేట్స్ కేటాయిస్తానని త్రివిక్రమ్‌కు మాటిచ్చాడట. అంటే.. ఏప్రిల్‌లో మొదలై.. జూన్ వరకు నాన్ స్టాప్‌గా షూటింగ్ ఉంటుందన్న మాట. ఈ ఏడాది డిసెంబర్‌‌లోపు షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్టుకు వెళ్లాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది.

  టైటిల్, పాత్ర ఇలా..!
  చాలా రోజులుగా.. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ అని కొందరు.. ఫ్యామిలీ బ్యాగ్ డ్రాప్‌ అని వార్తలు వినిపించినప్పటికీ ఫైనల్‌గా పొలిటికల్ అని తేలిపోయింది. ఢిల్లీ వేదికగా జరిగే రాజకీయాలకు సంబంధించి కాబట్టి పైన ఇంతవరకూ అనుకున్న టైటిల్‌నే ఖారారు చేసేశారట. అంటే ‘అరవింద సమేత’లో పాలిటిక్స్‌ను కాస్త మాత్రమే టచ్ చేసిన మాంత్రికుడు.. ఢిల్లీ వేదికగా కంప్లీట్‌గా రాజకీయం చేస్తాడన్న మాట. ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోయే ఎన్టీఆర్‌కు ఇది అదిరిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇదివరకటి సినిమాలోలాగా పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దేనే తీసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందట.

  రిలీజ్ డేట్ ఇదే..!
  ఏ సినిమా అయినా మొదట అనుకున్నప్పుడే దర్శకనిర్మాతలు రిలీజ్ ఎప్పుడు చేద్దామనే విషయంపై చర్చించుకునే ముందుకెళ్తుంటారు. అందుకే షూటింగ్‌కు ముందే ఓ డేట్‌ను త్రివిక్రమ్ ఫిక్స్ చేసుకున్నాడట. అదేమిటంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్-29న జూనియర్‌తో చేసే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడని సమాచారం. డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఎడిటింగ్ పనులు, ప్రమోషన్స్, ఫంక్షన్స్ అన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారన్న మాట. అంటే.. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’.. వచ్చే ఏడాది మాంత్రికుడి మూవీతో నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ‘అల వైకుంఠపురం’ మూవీతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త్రివిక్రమ్.. ఇప్పుడు అదే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ (ఈ ఏడాది రిలీజ్ అయితే..) రికార్డ్‌లను కూడా క్రియేట్ చేస్తారేమో చూడాలి.
  Published by:Anil
  First published: