హోమ్ /వార్తలు /సినిమా /

NTR30: శృతి హాసన్, జాన్వీ కపూర్‌లతో ఎన్టీఆర్ రొమాన్స్..

NTR30: శృతి హాసన్, జాన్వీ కపూర్‌లతో ఎన్టీఆర్ రొమాన్స్..

శృతి హాసన్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ Photo : Twitter

శృతి హాసన్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ Photo : Twitter

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇటీవల ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇటీవల ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడు. ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఛాన్స్ ఉందట. అందులో భాగంగా ఒక హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట. ఇక మరో హీరోయిన్‌గా మరోసారి పూజా హెగ్డేనే తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు తాజాగా శ్రుతి హాసన్‌ను చిత్ర బృదం పరిశీలిస్తుందట. ఆమెను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ శ్రుతి హాసన్ కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో హరీష్ డైరెక్షన్‌లో 'రామయ్యా వస్తావయ్యా' సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడు.

First published:

Tags: Janhvi Kapoor, Jr ntr, Shruti haasan, Trivikram Srinivas

ఉత్తమ కథలు