RRR : రాజమౌళికి నో చెప్పిన ఎన్టీఆర్ రామ్ చరణ్..

RRR : దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఆర్ ఆర్ ఆర్ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 25, 2020, 12:19 PM IST
RRR : రాజమౌళికి నో చెప్పిన ఎన్టీఆర్ రామ్ చరణ్..
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి Photo : Twitter
  • Share this:
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 08 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. అయితే లాక్ డౌన్‌లో ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో చిత్రబృందం ట్రయిల్ షూట్ హైదరాబాద్‌లో ప్రారంభించాలని భావించింది. అయితే ఆ ఆలోచనను కాని అర్ధాంతరంగా ఆపేశారు మేకర్స్. కారణం ఏమంటే.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రిస్క్ తీసుకోవద్దని రామ్ చరణ్‌.. దర్శకుడు రాజమౌళికి సూచించాడట.

మరో నటుడు ఎన్టీఆర్ కూడా ఈ సమయంలో షూటింగ్ చేయడం మంచిది కాదని భావించడంతో రాజమౌళి తన ఆలోచనని విరమించుకున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌ని ఒకసారి వాయిదా వేసింది చిత్రబృందం. అయితే ఈ కొత్త డేట్‌లోనైనా విడుదల చేద్దాం అని మేకర్స్ భావిస్తే కరోనా వచ్చి పూర్తిగా అన్ని ప్లాన్స్‌ను మార్చివేసింది. దీంతో ఈ సినిమా జనవరి 8న రిలీజ్ కావడం కష్టమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దీంతో మరోసారి రిలీజ్ డేట్ మారనుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
First published: June 25, 2020, 12:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading