NTR - Ram Charan - Rajamouli: ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమవ్వగా ఇప్పటికీ కూడా ఈ సినిమా.. షూటింగ్ బిజీలోనే ఉంది. మధ్యలో కోవిడ్ కారణంగా చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడగా ప్రస్తుతం చివరి దశలో ఉండటంతో మిగతా భాగం షూటింగును త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి పైనే సెటైర్లు వేశారు రామ్ చరణ్, ఎన్టీఆర్.
తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలో కూడా రాజమౌళి అంటే ఎంతో అభిమానం చూపిస్తారు ప్రేక్షకులు. అలాంటిది తమ సినిమా డైరెక్టర్ రాజమౌళి పైనే సెటైర్లు వేశారు ఈ స్టార్ హీరోలు. ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరలో రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులు కు హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ షో ప్రారంభం కాగా ఇందులో మొదటి ఎపిసోడ్ కు రామ్ చరణ్ పాల్గొన్నాడు.
అలా రామ్ చరణ్ రాకతో ఈ ఎపిసోడ్ మొత్తం బాగా సందడిగా సాగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య కొన్ని ఫన్నీ జోకులు కూడా తెగ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్.. తను అడిగిన ప్రశ్నకు సమయం మించిపోతుందని రామ్ చరణ్ తో అనడంతో.. మూడేళ్లుగా ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాం.. మనం సమయం గురించి ఆలోచించాలా అంటూ రామ్ చరణ్ పంచ్ వేశాడు.
వెంటనే ఎన్టీఆర్ తెగ నవ్వుకుంటూ.. ఏంటి ఈరోజు జుట్టు పెద్దగా ఉంది? జుట్టు ఇంత తక్కువగా ఉంది? అనే ప్రశ్నను రాజమౌళి వేశారని ఎన్టీఆర్ గుర్తు చేయగా.. మళ్లీ రామ్ చరణ్.. మూడు సంవత్సరాలు షూటింగ్ చేస్తే జుట్టు పెరగకుండా ఉంటుందా? జక్కన్న అని మళ్లీ పంచ్ వేసాడు. ఎన్టీఆర్ కూడా అవ్వదా మరి అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఈ ఎపిసోడ్ మాత్రం ఇంకా నెట్టింట్లో హల్ చల్ చేస్తూనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Evaru Meelo Koteeswarulu, NTR, Rajamouli, Ram Charan, Rrr movie