ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అధికారిక ప్రకటన ఆ రోజే..

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన కెజియఫ్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నాడు.

news18-telugu
Updated: May 9, 2020, 11:12 AM IST
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అధికారిక ప్రకటన ఆ రోజే..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ Photo : Twitter
  • Share this:
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెజియఫ్ డైరెక్ట్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ప్రశాంత్ నీల్‌ కెజియఫ్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటూ ఊర్రుతలూగిస్తుంది. దీంతో ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా అంటే అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ కథను సిద్ధం చేస్తున్నాడట. అందులో భాగంగా ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కనుందట. ఈ సినిమా 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్నాడు.

ఈ సందర్భంగా.. 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను వదలనున్నట్టు తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ తో చేయనున్న 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను వదిలే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు త్రివిక్రమ్ సినిమా తరువాత 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ చేయనున్న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజు వెలువడనుందని సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కునున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయించాడని సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో కనిపించనున్నాడట.
First published: May 9, 2020, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading