Home /News /movies /

NTR AKSHAY KUMAR REMAKE JR NTR FLOP MOVIES IN BOLLYWOOD HERE ARE THE DETAILS TA

NTR-Akshay: ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్న అక్షయ్ కుమార్..

ఎన్టీఆర్,అక్షయ్ కుమార్ (File/Photo)

ఎన్టీఆర్,అక్షయ్ కుమార్ (File/Photo)

NTR-Akshay Kumar | సాధారణంగా ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఒక లాంగ్వేజ్‌లో ఫ్లాపైనా ఓ చిత్రాన్ని మరో లాంగ్వేజ్‌లో ఎవరు రీమేక్ చేయరు. తాజాగా అక్షయ్.. ఎన్టీఆర్ నటించిన ఓ ప్లాప్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    NTR-Akshay Kumar | సాధారణంగా ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఒక లాంగ్వేజ్‌లో ఫ్లాపైనా ఓ చిత్రాన్ని మరో లాంగ్వేజ్‌లో ఎవరు రీమేక్ చేయరు. అయితే.. ఒక్కోసారి ఓ సినిమా ఫ్లాపైనా.. అందులో కంటెంట్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ఇక హిందీ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ఇక్కడ తెలుగులో హిట్టైనా సినిమాలకు ఎక్కువ గిరాకీ ఉంది. ఒక భాషలో హిట్ కాబట్టి.. కథ విషయంలో సేఫ్ గేమ్ ఆడొచ్చనేదే సినిమా దర్శకుల అభిప్రాయం. ఇప్పటికే హిందీలో తెలుగులో హిట్టైన ‘అల వైకుంఠపురుములో’ ‘ఇస్మార్ట్ శంకర్’ తో పాటు పలు చిత్రాలను రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమా 2011 దసరా కానుకగా విడుదలై ఫ్లాపైంది. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్, సురేందర్ రెడ్డి టేకింగ్‌కు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు.

    తెలుగులో ఫ్లాపైనా ఈ సినిమాను ఆ తర్వాత బెంగాలీతో పాటు పలు భాషల్లో రీమేక్ చేసారు. తాజాగా ఈ ఫ్లాప్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ చూసి ఫిదా అయిన అక్షయ్ కుమార్.. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే టిప్స్ సంస్థ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసింది.

    NTR-Akshay Kumar Remake jr ntr flop Movie in bollywood Here are the details,NTR,Akshay Kumar,Jr ntr RRR,jr ntr akshay kumar oosaravelli,Oosaravelli hindi remake,Oosaravelli hindi remake with akshay kumar,jr ntr twitter,akshay kumar twitter,jr ntr Oosaravelli,tollywood,bollywood,ఎన్టీఆర్,అక్షయ్ కుమార్,ఎన్టీఆర్ ఊసరవెల్లి,ఎన్టీఆర్ ఊసరవెల్లి రీమేక్‌లో హీరోగా అక్షయ్ కుమార్,ఊసరవెల్లి రీమేక్‌లో అక్షయ్ కుమార్,హిందీ ఊపరవెల్లి రీమేక్‌లో అక్షయ్ కుమార్
    ఎన్టీఆర్ ఊసరవెల్లి బాలీవుడ్ రీమేక్‌లో అక్షయ్ కుమార్ (File/Photos)


    ప్రస్తుతం అక్షయ్ కుమార్.. వరుస సినిమాలతో బిజీగా  ఉన్నాడు. రీసెంట్‌గా సౌత్‌లో హిట్టైన ‘కాంచన’ సినిమాను హిందీలో‌ ‘లక్ష్మి’ పేరుతో రీమేక్ చేసాడు. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.  ప్రస్తుతం అక్షయ్ కుమార్.. ‘బెల్ బాటమ్’, ‘ఐతరంగీ రే’తో పాటు ‘రామ్ సేతు’ పృథ్వీ రాజ్’ సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత ‘ఊసరవెల్లి’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akshay Kumar, Bollywood, Jr ntr, RRR, Tarak, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు