జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వరుస ట్రీట్లు వస్తున్నాయి. తారక్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కుతుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ 2 కు ముందు వరకు ఈ సినిమాపై ఓ అంచనాలు ఉన్నాయి. కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఎన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది.
కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ అయితే లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా టీం పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ ఊర మాస్ లుక్లో ఉన్న పోస్టర్ విడుదల అయ్యింది. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ సీరియస్గా కనిపిస్తున్నాడు, ఫేస్ మొత్తంగా కాకుండా.. సగం మాత్రమే కనిపిస్తోంది. ఆ ముఖంలో ఎక్కడ లేని కోపం కూడా కనిపిస్తోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పండగ చేస్తున్నారు. కొందరు అయితే ఇంత త్వరగా ఎలా అన్నా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్స్ రానున్నట్టు గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అందరు అనుకున్నట్లు ఆ బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది.
ఇక ఎన్టీఆర్ 30,ఎన్టీఆర్ 31 ఈ రెండు ప్రాజెక్టుల మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 లేదా ఒక రోజు ముందుగానే మే 19న అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించారు. ఎన్టీఆర్ 31 ను ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ ఫోటో షూట్ టెస్ట్ షూట్ నిర్వహించాడు. ఈ పోస్టర్ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా 32 కెమెరాలు ఉపయోగించాడని సమాచారం. అయితే సినిమా ప్రారంభంకు కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది. షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సాలార్ మూవీతో బీజీగా ప్రశాంత్ నీల్... వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.