ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. కాగా గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ ఏమంత గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడు. ఈ సినిమాకు అయినను పోయిరావలే హస్తినకు అనే పేరు పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ నుండి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా జూన్ ఫస్ట్ వీక్ లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేశారు. కానీ కరోనా అన్ని ప్లాన్స్ ను ఆగం చేసింది. దీంతో ఇక మధ్యలో గ్యాప్స్ అన్నవి లేకుండా సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రం షూటింగును పూర్తి చేసేలా దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. అలాగే షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే చేస్తారని తెలుస్తోంది.

ఎన్టీఆర్,త్రివిక్రమ్ (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఛాన్స్ ఉందట. అందులో ఒక హీరోయిన్గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట. ఇక మరో హీరోయిన్గా మరోసారి పూజా హెగ్డేనే తీసుకోవాలనీ భావిస్తోందట చిత్రబృందం. త్రివిక్రమ్ తన గత రెండు సినిమాల్లోను పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలోను ఆమెనే తీసుకునే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. కారణం ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. దీంతో ఆమెవైపే చూస్తున్నాడట. ఇక ఈ సినిమాలో రాజకీయ నేపథ్యంలో సాగనుంది. అంతేకాదు ఓ సామాజిక అంశాన్ని చర్చించనున్నాడు త్రివిక్రమ్.
పాన్ ఇండియా లెవెల్లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడట దర్శకుడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్‌కు సరిసమానంగా ఆయన పాత్ర ఉండనుందట. ఈ రెండు క్యారెక్టర్స్ పోటాపోటిగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలను నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కనున్నది. ఇక సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:September 10, 2020, 07:51 IST