హోమ్ /వార్తలు /సినిమా /

NTR 30 : ఎన్టీఆర్ 30లో కీలకపాత్రలో నటించనున్న సైఫ్ అలీ ఖాన్..

NTR 30 : ఎన్టీఆర్ 30లో కీలకపాత్రలో నటించనున్న సైఫ్ అలీ ఖాన్..

NTR 30 Photo : Twitter

NTR 30 Photo : Twitter

NTR 30 : ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.  2022 మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ఆస్కార్‌ను గెలిచింది. నాటు నాటు పాట (Naatu Naatu) ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్‌(Oscar Award)ను దక్కించుకుంది.. దీంతో టీమ్ సంబరాల్లో మునిగితేలుతోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ (NTR 30) సినిమాను కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వర్క్ పూర్తి అయ్యింది. షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఓ లుక్‌ను కూడా టీమ్ ఇటీవల విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో మరో కీలకరోల్‌లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నట్లు టాక్ రాగా.. లేటెస్ట్‌గా ఆయనే ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అతి త్వరలో ఓ ప్రకటన రానుంది.  సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్‌ల మధ్య వచ్చే సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. ఇక ఇప్పటికే సైఫ్, ప్రభాస్ ఆదిపురుష్‌లో ఓ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను ముఖ్యంగా హైదరాబాద్‌, వైజాగ్‌, గోవాలో వేసిన సెట్స్‌లో జరుపునున్నారట. అలాగే ఈ చిత్రానికి భారీగా వీఎఫ్‌ఎక్స్ ఉంటుందని అంటున్నారు. ఇలా భారీ హంగులతో రెడీ అవుతోంది ఎన్టీఆర్ 30. దీంతో ప్రస్తుతం టీమ్ షూటింగ్ కోసం సెట్స్‌ను వేస్తున్నారు.

NTR 30
NTR 30 Photo : Twitter

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ సినిమా గ్రాండ్‌ లాంఛ్ మార్చి 23న జరుగునుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు పలువురు సినీప్రముఖులు హాజరు కానున్నారు. ఇక మూవీ రెగ్యులర్ షూట్ మార్చి 30 నుండి షురూ కానుందని టాక్. ఈ విషయంలో అతి త్వరలో టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేయనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదలకానుంది.. యాక్షన్ సీన్స్‌తో షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లుతెలుస్తోంది. మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందట. దీనికి సంబంధించి టీమ్ ఇప్పటికి చేయాల్సిన ఏర్పాట్లు కూడా చేసిందని టాక్.

అత్యంత వైభవంగా సెట్స్‌ను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ఓపెనింగ్ షెడ్యూల్‌ను ఇక్కడే చిత్రీకరించనున్నారట.. ఈ సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్నకథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నారట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్‌కు కాస్తా ఆలస్యం అవుతోందని అంటున్నారు.  ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈసినిమా 2024 ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు.

ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక  ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఆ మధ్య ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్స్ అదిరిపోయాయి. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా అంటూ సాగే వీడియో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో భారీ మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారు. అయితే ఒకటి కాదు.. రెండు ఎన్టీఆర్ 31, ఎన్టీఆర్ 32. వరుసగా రెండు సినిమాలను ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోందని టాక్. ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ మూవీ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్, తమిళ దర్శకుడు  వెట్రీ మారన్‌తో కూడా ఓ సినిమాను ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. వెట్రి మారన్ ప్రస్తుతం సూర్యతో వాడివాసల్ అనే మూవీ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు వెట్రీ, ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయనున్నారట. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండవ భాగంలో ధనుష్ హీరోలుగా నటిస్తారట..

First published:

Tags: NTR30, Tollywood news

ఉత్తమ కథలు